ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

Update: 2024-05-12 23:58 GMT
Live Updates - Page 2
2024-05-13 12:30 GMT

రాష్ట్రవ్యాప్తంగా 5 గంటల వరకు 67.99 శాతం ఓటింగ్ నమోదు.

ఆత్యల్పంగా కురుపాం నియోజకవర్గం లో సాయంత్రం 5 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు.

ఆత్యధికంగా గంగాధర నెల్లూరు సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గం లో 79.9 శాతం నమోదు

2024-05-13 12:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటలకు వరకు నమోదైన పోలింగ్ శాతం 67.99%


అల్లూరి సీతారామరాజు మన్యం 55.17%

అనకాపల్లి 65.97%

అనంతపురం 68.04%

అన్నమయ్య 67.63%

బాపట్ల 72.14%

చిత్తూరు 74.06%

కోనసీమ 73.55%

తూర్పు గోదావరి 67.93%

ఏలూరు 71.10%

గుంటూరు 65.58%

కాకినాడ 65.01%

కృష్ణా 73.53%

కర్నూలు 64.55%

నంద్యాల 71.43%

ఎన్‌టీఆర్ 67.44%

పల్నాడు 69.10%

పార్వతిపురం 61.18%

ప్రకాశం 71.00%

PSMR నెల్లూరు 60.14%

శ్రీసత్యసాయి 60.65%

శ్రీకాకుళం 57.56%

తిరుపతి 56.14%

విశాఖపట్నం 48%

విజయనగరం 56.32%

పశ్చిమ గోదావరి 56.53%

కడప 62.56%

2024-05-13 12:07 GMT

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం - 62.31%

ఆంధ్రప్రదేశ్ - 68.04%

బీహార్ -54.14%

జమ్మూ అండ్ కాశ్మీర్ -35.75 %

జార్ఖండ్ -63.14%

మధ్యప్రదేశ్ -68.01%

మహారాష్ట్ర - 52.49%

ఒడిస్సా - 62.96%

తెలంగాణ - 61.16%

ఉత్తర ప్రదేశ్ -56.35 %

వెస్ట్ బెంగాల్ - 75.66%

2024-05-13 12:04 GMT

ఓటమి భయంతోనే ఘర్షణలు: బోడే ప్రసాద్

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలపై పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా కొట్లాటలు, ఘర్షణలకు దిగుతోందని ఆరోపించారు. గొడవలతో పోలింగ్‌ను అడ్డుకోవాలని వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు.

2024-05-13 11:58 GMT

గన్నవరంలో వల్లభనేని వంశీ దౌర్జన్యం

గన్నవరం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పొట్లూరి బసవరావు ఇంటికి వెళ్లి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ దురుసుగా ప్రవర్థించారు. తనను నోటికి వచ్చినట్లు వంశీ తిట్టారని, తాను టీడీపీలో ఉన్నాన్న కక్షతోనే ఆయన తీవ్ర పదజాలం వినియోగించారని బసవరావు వెల్లడించారు. తనపైకు వంశీ గొడవకు వచ్చారని, అప్పుడు తనకు మద్దతుగా గ్రామ ప్రజలు, స్థానికులు రావడంతో అక్కడి నుంచి వంశీ వెళ్లిపోయారని బసవరావు చెప్పారు.


2024-05-13 11:57 GMT

ముగిసిన పోలింగ్


164 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్.

2024-05-13 11:49 GMT

పోలింగ్ అధికారిపై దాడి

గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఓ వృద్ధ ఓటరు తన ఓటును టీడీపీకి వేశారనే అనుమానంతో పోలింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో విరుచుకుపడి సదరు అధికారిని బయటకు పంపించేశారు.

2024-05-13 11:34 GMT

హింసా ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం


నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహనిర్బంధం చేయటంతో పాటు వారిపై కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 - 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

2024-05-13 11:32 GMT

ఓటు హక్కును వినియోగించిన రఘురామ

నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు ఈరోజు భీమవరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 11:17 GMT

సీఎం జగన్, విడదల రజనీపై కేసు నమోదు

ఆంధ్రలో ఒకవైపు పోలింగ్ జరుగుతున్నప్పటికీ సీఎం జగన్, విడదల రజనీ పేరుతో ఐవీఆర్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కాల్స్‌లో కోరడంపై గుంటూరు పశ్చిమనియోజకవర్గం ఓటర్లు, టీడీపీ నేతలు దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ.. ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ.. పోలీసులను పలు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు.. జగన్, విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఐసీపీలోని 188, 171ఎఫ్, 171హెచ్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123, 126, 130 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News