ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

Update: 2024-05-12 23:58 GMT
Live Updates - Page 3
2024-05-13 11:08 GMT

తిరుపతిలో గాలిలోకి కాల్పులు

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్ారహ్మణ కాలువ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షన జరిగింది. వారిని అదుపు చేయడానికి సీఆర్పీఎప్ సిబ్బంది ప్రయత్నించారు. అందులో భాగంగానే గాలిలోకి కాల్పులు జరిపారు.

2024-05-13 11:06 GMT

ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ ఇవే

ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్

కడపలో : 60.57 శాతం

చిత్తూరులో : 64.64 శాతం

బాపట్లలో : 59.49 శాతం

అల్లూరిలో : 48.87 శాతం

అనకాపల్లిలో : 53.45 శాతం

అనంతపురంలో : 54.25 శాతం

అన్నమయ్యలో : 54.44 శాతం

కృష్ణాలో : 59.39 శాతం

కోనసీమలో : 59.73 శాతం

నంద్యాలలో : 59.30 శాతం

విశాఖపట్నంలో : 46.21 శాతం

ఏలూరులో : 57.14 శాతం

పశ్చిమ గోదావరి జిల్లాలో : 54.60 శాతం

నెల్లూరులో : 58.14 శాతం

కర్నూలులో : 52.26 శాతం

ప్రకాశంజిల్లాలో : 59.96 శాతం

ఎన్టీఆర్‌ జిల్లాలో : 55.71 శాతం

విజయనగరంలో : 54.31 శాతం

తూర్పు గోదావరి జిల్లాలో : 52.32 శాతం

పల్నాడులో : 56.48 శాతం

శ్రీకాకుళంలో : 54.87 శాతం

తిరుపతిలో : 54.42 శాతం

గుంటూరులో : 52.24 శాతం

కాకినాడలో : 52.69 శాతం

సత్యసాయి జిల్లాలో : 57.56 శాతం

పార్వతీపురం మన్యం జిల్లాలో : 51.75 శాతం

2024-05-13 11:01 GMT

120 దాటిన హింసాత్మక ఘటనలు

పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు 120కిపైగా నమోదయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరో 11 ఫిర్యాదులను ఈసీకి అందించనున్నట్లు టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ నేతలే హింసకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.

2024-05-13 10:35 GMT

అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్.

2024-05-13 10:33 GMT

నరసరావుపేట నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్‌లు.



2024-05-13 10:29 GMT

ప్రతి ఓటరుకు స్ఫూర్తి

16 కిలో మీటర్లు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి మరీ ఓటు వేసిన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు


2024-05-13 10:27 GMT

కడప జిల్లాలో మధ్యాహ్నం 3గంటల వరకు 60.57% శాతం పోలింగ్ నమోదు..

బద్వేల్ 61.97%

కడప 51.26%

పులివెందుల 64.83%

కమలాపురం 61.67%

జమ్మలమడుగు 64.6%

పొద్దుటూర్ 57.98%

మైదుకూరు 64.31%

2024-05-13 10:27 GMT

నాలుదో దశ లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలవరకు నమోదైనా పోలింగ్ శాతం 52.60%

ఆంధ్రప్రదేశ్ -55.49%

బీహార్ -45.23%

జమ్మూ అండ్ కాశ్మీర్ - 29.93%

జార్ఖండ్ -56.42%

మధ్యప్రదేశ్ -59.63%

మహారాష్ట్ర -42.35 %

ఒడిస్సా - 52.91%

తెలంగాణ - 52.34%

ఉత్తర ప్రదేశ్ -48.41 %

వెస్ట్ బెంగాల్ - 66.05%

2024-05-13 10:25 GMT

హింసాత్మక ఘటనలపై ఈసీకి మాజీ ఎంపీ కనకమేడల

పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ.. ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ను సమస్యాత్మకంగా మారుస్తున్నారని ఆరోపించారు. పల్నాడు, పుంగనూరు, మాచర్ల, తాడిపత్రిలో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని వివరించారు. ‘‘మాచర్ల చెందిన నేతను వైసిపి నేతలు చంపేశారు. పల్నాడు లో ఎంపీ లావు కృష్ణదేవరాయల వాహనాల పై దాడి చేశారు. పుంగనూరు,తడిపత్రిలో మోడల్ కోడ్ కండక్ట్ ను ఉల్లంఘించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసిపి నేతలు టిడిపి నేతల పై దాడుల చేశారు.

స్పీకర్ తమ్మినేని సతీమణి సహితం బూత్ క్యాప్చర్ చేశారు. తెనాలి ఎమ్మెల్యేలే బూత్‌లో ఓటరు పై దాడి చేశారు. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లను తీసుకెళ్ళారు. పోలింగ్ బూత్‌లో లైన్‌లో ఉన్న ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్నవారు ప్రశాంతంగా ఓటు వేసుకునే వాతావరణాన్ని నెలకొల్పాలి. ఈ విషయాలను పేర్కొంటూ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు అది కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాను’’ అని ఆయన వివరించారు. అనంతరం దౌర్జన్యం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానిక పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

2024-05-13 10:09 GMT

కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 52.49 శాతం

8 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 52.26 శాతం

కర్నూలు : 47.79 శాతం

పాణ్యం : 51.08 శాతం

పత్తికొండ : 58.82 శాతం

కోడుమూరు : 53.18 శాతం

ఎమ్మిగనూరు : 49.73 శాతం

మంత్రాలయం : 55.36 శాతం

ఆదోని : 48.06 శాతం

ఆలూరు : 55.62 శాతం

Tags:    

Similar News