నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 2
2024-06-04 11:40 GMT

కమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం. 24,972 ఓట్ల మెజార్టీతో గెలిచిన చైతన్య రెడ్డి. 

2024-06-04 11:39 GMT

బీజేపీ అభ్యర్థి ఘన విజయం. 17,181 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ గెలుపు.

2024-06-04 11:39 GMT

టీడీపీ అభ్యర్థి ఘన విజయం. 27,007 ఓట్ల మెజార్టీతో గెలిచిన తంగిరాల సౌమ్య. 

2024-06-04 11:17 GMT

పవన్ గెలుపుపై బన్నీ రియాక్షన్ ఇదే

ఆంధ్ర ఎన్నికల నడుప మెగా, అల్లూరి కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంపై బన్నీ స్పందించారు. పవన్ కల్యాణ్‌ను అభినందనలు తెలిపారు. ప్రజాసేవ దిశగా మీరు చేపట్టిన సరికొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటూ.. అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.



2024-06-04 11:13 GMT

సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు. 8,159 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు.

2024-06-04 11:12 GMT

పవన్‌పై చిరంజీవి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం సాధించింది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంపై చిరంజీవి స్పందించారు. చంద్రబాబు, పవన్‌కు ప్రశంసిస్తూ ఎక్స్(ట్వీట్) చేశారు.



2024-06-04 11:09 GMT

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌ రెడ్డి విజయం. 5,972 ఓట్ల మెజార్టీతో రాజశేఖర్‌ రెడ్డి గెలుపు. 

2024-06-04 11:08 GMT

పాలకొండ నియోజకవర్గం నిమ్మక జై కృష్ణ సమీప ప్రత్యర్థి కళావతి పై 22,500 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు డిప్లరేషన్ ఫామ్ కి స్వగ్రామం నుంచి పార్వతిపురం మన్యం జిల్లా ఉల్లి భద్ర కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీ వాహన శ్రేణులు బయలుదేరారు

2024-06-04 11:07 GMT

జగన్‌ మించిన లోకేష్

మంగళగిరి లో పదిహేను రౌండ్లు ముగిసే సరికి 70,077 ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పులివెందులలో జగన్‌ కేవలం 61,169 మెజార్టితో గెలుపు సాధించారు.

2024-06-04 11:05 GMT

7000 మెజారిటీతో రాయచోటిలో 20 సంవత్సరాల తర్వాత టిడిపి జెండా పాతిన రాంప్రసాద్ రెడ్డి.

రాయచోటిలో సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.

రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికేందుకు హారతులతో సిద్ధమైన మహిళలు.

Tags:    

Similar News