నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 12:42 PM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై రేణుదేశాయ్ స్పందించారు. “ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు.
- 4 Jun 2024 12:38 PM GMT
మంగళగిరిలో భారీ గెలుపు దిశగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
19 రౌండ్లు ముగిసేసరికి 83,473 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో దూసుకెళ్తున్న నారా లోకేష్
ఇంకా మిగిలి ఉన్న మూడు రౌండ్ల కౌంటింగ్
- 4 Jun 2024 12:38 PM GMT
‘‘సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు. భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు. నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు. కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు ఎక్స్(ట్వీట్) చేశారు.
- 4 Jun 2024 12:28 PM GMT
అన్నను ఓడించి తమ్ముడు
విజయవాడ ఎంపీగా కేశినేని నానిపై తమ్ముడు కేశినేని చిన్న ఘన విజయం సాధించారు. 2,82,085 ఓట్ల మెజార్టీతో చిన్న విజయం సాధించారు.
- 4 Jun 2024 12:24 PM GMT
ఆలూరు వైసిపి అభ్యర్థి విరుపాక్షి 2851 ఓట్లతో గెలుపు...
టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ రీకౌంటింగ్ జరపాలని కోరారు...
స్వల్ప మెజారిటీతో వైసిపి అభ్యర్థి గెలుపొందడంతో మరోసారి కౌంటింగ్ జరపాలని కోరిన టిడిపి అభ్యర్థి...
వైసిపి అభ్యర్థి గెలుపొందినట్లు ఆర్ వో కు కోరారు...
ఆలూరు నియోజకవర్గ రీకౌంటింగ్ పై నాయకులలో నెలకొన్న ఉత్కంఠ...
రికౌంటింగ్ చేసే దిశగా ఎన్నికల అధికారులు...
- 4 Jun 2024 12:13 PM GMT
నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథి ఘనవిజయం. 12,221 ఓట్ల మెజార్టీతో వైసీపీని చిత్తు చేశారు.
- 4 Jun 2024 12:12 PM GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం. గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్. కాసేపట్లో మంగళగిరిలో చంద్రబాబు, పవన్ భేటీ. మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు.
- 4 Jun 2024 12:10 PM GMT
కూటమికి ఆర్‌జీవీ విషేస్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సాధించిన విజయంపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- 4 Jun 2024 11:40 AM GMT
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి ఘనవిజయం. 23,191 ఓట్ల మెజార్టీతో గెలిచిన నంద్యాల వరదరాజుల రెడ్డి.