తిరుమల: సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సెప్టెంబర్ నెలలో విశేష కార్యక్రమాలు ఇవి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-30 09:16 GMT
తిరుమల శ్రీవారి క్షేత్రంలో నిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్వహించే కార్యక్రమాలకు ఓ క్యాలెండర్ సిద్దం చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించే విశేష కార్యక్రమాలను టీటీడీ వెల్లడించింది. శ్రీవారి వార్షిక బ్రహ్మెత్సవాల నేపథ్యంలో వారం ముందే అంటే 16వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలకు 23వ తేదీ అంకురార్పణ జరుగుతుంది.
సెప్టెంబర్ లో విశేష పర్వదినాలు
సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి
4వ తేదీ:వామన జయంతి
5వ తేదీ: అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
6వ తేదీ: మహాలయ పక్ష ప్రారంభం
10వ తేదీ: బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె)
16వ తేదీ: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
21వ తేదీ: మహాలయ అమావాస్య
23వ తేదీ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
24వ తేదీ: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
28వ తేదీ:తిరుమల శ్రీవారి గరుడోత్సవం
29వ తేదీ: తిరుమల శ్రీవారి స్వర్ణరథం