సీఎస్ ను కలిసిన ఏపీ అంధుల క్రికెట్ అసోసియేషన్ బృందం
అంధుల క్రికెట్ టీమ్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ప్రత్యేకంగా అభినందించారు.
By : Vijayakumar Garika
Update: 2025-12-03 15:08 GMT
ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ను కలిసింది. ఇటీవల అంధ మహిళల ప్రపంచ క్రికెట్ కప్ గెలుగుకున్నఈబృందం టీమ్ కెప్టెన్ దీపిక, టీం సభ్యురాలు కరుణ కుమారి నేతృత్వంలో సిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అంధుల క్రికెట్ టీమ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అంధులైన క్రికెటర్లకు ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
సిఎస్ ను కలిసిన వారిలో ఏపి క్రికెట్ బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్న శరత్‌బాబు, కార్యదర్శి జి.రవీందర్, కోచ్, ట్రైజరర్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, టి20 ప్రపంచ కప్ బ్లైండ్ క్రికెట్ ఇండియా కెప్టెన్ దీపిక టిసి, టి20 ప్రపంచ కప్ బ్లైండ్ క్రికెట్ స్టార్ ప్లేయర్ కరుణ కుమారి, టీం ఇండియా మేనేజర్ శికా శెట్టి, బోర్డు మేనేజర్ కె.కీర్తన, మెడికల్ హెడ్ డాక్టర్ జింకా లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ నారాయణ్ కుర్రా బెంగళూరు తదితరులు పాల్గొన్నారు.