రెక్కలు విచ్చుకుంటున్న టమాట ధర..!

టమాట రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. రెండు నెలల వ్యవధిలో టమాటా ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. కిలో రు. వంద దిశగా పయనిస్తున్న ధర, ఇంకా ఎలా ఉండబోతోంది..

Update: 2024-10-08 10:20 GMT

రెండు నెలల వ్యవధిలో టమాట రైతులకు కాస్త ఉపశమనం. దిగుబడి తగ్గడం వల్ల టమాటా ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా టమోటా ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఆసియాలో పెద్దదైన చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు భారమైన రెండు నెలల వ్యవధిలో రైతులకు కాలం కాస్త కలిసి వచ్చినట్లు ఉంది. ఈ పరిస్థితికి ప్రధానంగా, సమీపంలోనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల టమాటా దిగుబడి తగ్గింది. ఆశించిన ఉత్పత్తి కంటే మదనపల్లి మార్కెట్ కు టమోటాలు తక్కువ వస్తుండడం వల్ల ధరలు పెరగడానికి ఆస్కారం కల్పించినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లోనే కిలో టమోటా రు. 88 పలికింది. బహిరంగ మార్కెట్లో ఆ ధర కాస్త ఎక్కువగానే విక్రయిస్తున్నారు.


గత నెలను మించిన ధర...

టమాటాకు అధికంగా డిమాండ్ ఉండడం వల్ల ఈ ఏడాది సెప్టెంబర్ 22న కిలో టమాట అత్యధికంగా రు. 80 పలికింది. అయితే, వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల దిగుబడి కూడా పెరగడం, మార్కెట్కు అధికంగా సరుకు వచ్చేది. దీంతో ధరలు దిగి వచ్చాయి. రూ. 40 నుంచి రూ. 70 వరకు గ్రేడ్ ని బట్టి ధర పెరుగుతూ వచ్చింది. తాజాగా మంగళవారం కిలో రూ. 58 నుంచి రూ. 88 వరకు మదనపల్లి మార్కెట్ లోనే ధర పలికింది. ఈ ప్రభావం బహిరంగ మార్కెట్లో ఎక్కువగా చూపిస్తోంది. రూ. 95 నుంచి వంద వరకు కూడా కిలో టమాటా విక్రయిస్తున్నారు.
రికార్డు ధర
ఏడాది కిందట మదనపల్లె టమాటా మార్కెట్ లో రికార్డు ధర పలికింది. ఆ సమయంలో రైతుబజార్ల ద్వారా  ప్రభుత్వం రూ. వందకు అందుబాటులోకి తెచ్చింది.  మార్కెట్ లోనే కిలో రూ. 196 పలికింది.
2023  ఆగష్టు ౩౦ : మదనపల్లె మార్కెట్ చరిత్రలో రికార్డు స్ధాయి ధర అనిచెప్పవచ్చు. అక్కడే రైతుల నుంచి కిలో రూ.  196 కు గొనుగోలు చేయడం గమనార్హం. ఆ తరువాత

2023 సెప్టెంబర్: ఇదే మార్కెట్లో  కిలో రూ. 80  ధర పలికింది. ఆ తరువాత తాజాగా ధరలు పెరగడం వల్ల వినియోగదారులకు భారమైనా, రైతులకు అాసాధారణంగా ఇలాంటి అవకాశాలు కలిసిరావడం అరుదు. 


కారణం ఇదే..
ఇటీవల కొన్ని రోజులుగా మదనపల్లి ప్రాంతంలో ఓ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. దీంతో దిగుబడి కూడా తగ్గింది. ఈ మార్కెట్ కు దీటుగా ప్రాధాన్యత కలిగిన సమీపంలోనే ఉన్నకర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా, పరిసర ప్రాంతాల్లో కూడా పంట దిగుబడి తక్కువగానే ఉంది. అందువల్ల ఆ ప్రాంత వ్యాపారులు మదనపల్లికి రావడం లేదు. దీంతో అక్కడి టమాటాలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో ధరల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడింది.
రావాల్సిన టమాటాలు..

మదనపల్లి మార్కెట్ కు ప్రస్తుత సీజన్లో 1100 నుంచి 1500 టన్నుల వరకు టమాటా దిగుబడి రావాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా టమాటా సాగు తగ్గించారు. దీనివల్ల ఉత్పత్తి పెరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. దీనివల్ల టమాటా ధరలు పెరగడానికి ఆస్కారం కలిపించిందని విశ్లేషిస్తున్నారు.
తక్కువగా...
మదనపల్లి మార్కెట్ కు సోమవారం 610 టన్నులు టమోటాలు రైతులు తీసుకువచ్చారు. ఇందులో మొదటి రకం టమోటాలు కిలో 74 నుంచి 8 వరకు పలికాయి. రెండో రకం 58 నుంచి 72 వరకు పలికాయి. ఆ లెక్కన 25 కిలోల ఉన్న టమోటాల క్రేట్ ధర రూ. 1800 నుంచి 2000 వరకు కొనుగోలు చేశారు. వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు పరుగు ప్రాంతంలోని మార్కెట్లకు తరలించారు. మదనపల్లి నుంచి నాణ్యమైన టుమాటాలను దేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ , హర్యానా, హైదరాబాద్ తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు.
Tags:    

Similar News