దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ ఉన్నాయి
మన సంçస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి, మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేసిన బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏడాదిన్నర కిందటి వరకూ రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందమే లేదు. ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే నాడు రాజ్యమేలాయి. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజల ముఖాల్లోకి స్వేచ్ఛ, సంతోషం వచ్చింది. అని సీఎం చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి సుపరిపాలన అందిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి రికార్డు స్థాయి విజయంతో గెలిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సంతోషంగా వినియోగించుకుంటున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన ఘనత ప్రజలదే. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా విధ్వంసం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ట్రాక్ లో పెట్టాం. మూడేళ్లలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడే స్థిరపడడానికి వెనక్కి వస్తారు. ఎన్టీఆర్, అక్కినేని, ఘంటశాల లాంటి ప్రముఖులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు. విజయవాడ ఉత్సవ్ తో నగరం నూతన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి అవసరం. అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే అని సీఎం పేర్కొన్నారు.