SHAR | రూపం మార్చిన 'రుక్మిణీ'.. సీమాంతర ఉగ్రవాదంపై 'ఉగ్రిణీ'!

మిలిటరీ ఆపరేషన్స్ కోసం ప్రయోగానికి సిద్ధం అవుతున్న G Sat-7R శాటిలైట్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-07 10:15 GMT

సీమాంతర ఉగ్రవాదం, ఆయుధాల అక్రమ రవాణా వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కేంద్ర రక్షణ దళాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (Satish Dhawan Space Launch Center ISRO) వెన్నుదన్నుగా ఇస్రో నిలుస్తోంది. కీలకమైన హిందూమహాసముద్రం తీరప్రాంతాల నుంచి శత్రుదేశాల సైనిక దళాల ఎత్తులను చిత్తు చేసే జీశాట్-7 ఆర్ (G Sat-7R) శాటిలైట్ ప్రయోగానికి ఇస్రో సమాయత్తం అవుతోంది. రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ ఈ నెలాఖరులో నింగిలోకి పంపడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

తిరుపతి జిల్లా సూళ్లురుపేటలోని షార్ ( Satish Dhawan Space Centre - SHAR ) ఇస్రో కు జీశాట్-7 ఆర్ ఉపగ్రహం సీఐఎస్ఎఫ్ కమాండోల కట్టుదిట్టమైన భద్రత మధ్య బెంగళూరు నుంచి తీసుకుని వచ్చారు. శ్రీహరికోటలోని ఈ రాకెట్ పనితీరు అధ్యయనం, పరీక్షలు నిర్వహించాక రాకెట్ కు అనుసంధానం చేయనున్నారు. ఈ ఉపగ్రహం సైనిక దళాలకు ఉపయోగపడే విధంగా అధునాతన పరికరాలు అమర్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.
సుదీర్ఘ ప్రయాణంలో... విజయాలు
శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం 1971 అక్టోబర్ 9న తేదీ రోహిణి-125 సౌండ్ రాకెట్ తో ప్రయోగాత్మక పరీక్షలకు శ్రీకారం చుట్టారు. 55 సంవత్సరాల సుదీర్ఘప్రయోగాల ప్రయాణంలో చంద్రుడిపై కూడా అన్వేషణక చంద్రయాన -1 ప్రయోగం వరకు స్వదేశీ ఉపగ్రహాల తయారీ, ప్రయోగం వరకు షార్ కేంద్రం పయనం సాగిస్తోంది. ఈ ప్రస్థానంలో షార్ నుంచి ధ్రువ ఉపగ్రహాలు, జియోసింక్రనైజ్డ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మూడు లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. చంద్రయాన్ ఉపగ్రహాల ప్రయోగానికి వెదికగా నిలిచి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరనన నిలపడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ విజయాలతో ఇక్కడి శాస్త్రవేత్తలు చంద్రయాన్ తో పాటు మార్స్ ఆర్బిటర్ మిషన్, సౌర పరిశోధనకు మిషన్ ఆదిత్య-ఎల్-1, అంతరిక్ష అబ్వర్వేటరీ XpoSat ప్రయోగంగా ద్వారా ఇప్పటి వరకు
2025 జూలై నాటికి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 102 ప్రయోగాలు చేశారు. వాటిలో 86 విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు విజయదరహాసంతో మరిన్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ పరంపరంలో 11 ప్రయోగాలు విఫలమయ్యాయి. ఆ అపజయాలను కూడా విజయాలుగా మలుచుకున్న ఖ్యాతి ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కింది.
సైనిక అమ్ములపొదిలోకి..
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం భారతదేశ రక్షణ, తీరప్రాంతాల గస్తీ, భద్రత కోసమే కాకుండా వ్యవసాయ, విద్యా సంబంధ రాకెట్లను కూడా ప్రయోగించింది. ఆ కోవలోనే ఈ నెలాఖరులో ప్రయోగించనున్న జీశాట్-7 ఆర్ ఉపగ్రహం కూడా కీలకం కానున్నది. భారత నావికాదళం, సైనికుల కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత శక్తిమంతం చేసే దిశగా ఉపకరణాలు అమర్చారనేది సమాచారం.
ఎలా పనిచేస్తుంది...
జీశాట్-7 ఆర్ ఉపగ్రహం ఏడేళ్లకాలం పాటు సేవలు అందిస్తుందనేది శాస్త్రవేత్తల ద్వారా తెలిసింది. ఈ సరీస్ లో ఈ ప్రయోగంలో ఆధునీకరించిన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రయోగించిన జీశాట్-7 రుక్మిణి శాటిలైట్ ను మించి జీశాట్-7 ఆర్ లో వాడిన సాంకేతిక పరికరాలు..
"ఈ ఉపగ్రహం మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత పదును పెడుతుంది" అని ఓ శాస్త్రవేత్త చెప్పారు. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి అనువైన సాంకేతికత వినియోగించారనేది సమాచారం. సైనిక పాటవాలకే కాకుండా, భారత నావికాదళానికి దిక్సూచిగా మారుతుందని ఇస్రో తన వైబ్ సైట్ లో ప్రస్తావించింది.
ఈ ఉపగ్రహం హిందూమహాసముద్రం తీరప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచుతుంది.
యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలకు మరింత సురక్షితమైన సమాచారం అందించేందుకు వీలుగా శాటిలైట్ ను తయారు చేశారు. భూ స్థిర కక్ష్యలో పనిచేసే ఈ శాటిలైట్ ఈ నెలాఖరులోపు మూడో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా
హిందూమహాసముద్రంపై మరింత పట్టు
హిందూ మహాసముద్రం మరింత పట్టు సాధించే దిశగానే జీశాట్-7 ఆర్ ఉపగ్రహానికి రూపకల్పన చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలమార్గం. దేశానికి ఈ మహాసముద్రం వ్యూహాత్మక స్థానం అనేది చరిత్ర చెబుతున్న మాట. భౌగోళికంగానే కాకుండా, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వాణిజ్యానికి ఈ సముద్రం వ్యూహాత్మక వాణిజ్య, రవాణాకు జీవరేఖగా ఉంది. ఈ మార్గంలోనే అనేక ఎదురవుతున్న సవాళ్లలో ప్రధానంగా సముద్ర భద్రత ముప్పు, స్మగ్టింగ్, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా వంటి సవాళ్లకు హిందూ మహాసముద్రం నుంచి ఎదురువుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించిన నేపథ్యంలో వినువీధి నుంచి నిఘా అవసరం ఏర్పడింది. దీంతో..
భారత నావికాదళం అమ్ములపొదిలో ప్రధాన సాంకేతిక అస్త్రంగా నిలపడానికి జీశాట్-7 ఆర్ ఉపగ్రహ ప్రయోగానికి శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం సమాయత్తం అవుతోంది. ఈ రాకెట్ లో LVM3 ఉపకరణాలు అలర్చిన శాటిలైట్ భూ స్థిర కక్ష్యలో ఉండే విధంగా సాంకేతిక అంశాలు వినియోగించినట్లు ఇస్రో తన ఖాతాలో స్పష్టం చేసింది. 2,650 కిలోల బరువు ఉన్న ఈ శాటిలైట్ ప్రాజెక్టకు ప్రయోగానికి 1,589 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. రక్షణ వ్యూహంలో కీలకంగా మారనున్న GSat-7 R శాటిలైట్ కు 2013 నుంచి సేవలు అందిస్తున్న GSat-7 (రుక్మిణి)కు మరింత ఆధునిక రూపం ఇచ్చారు. ఈ రాకెట్ ప్రయోగ తేదీని శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రకటించాల్సి ఉంది.
Tags:    

Similar News