ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x

ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

Live Updates

  • 13 May 2024 10:24 AM IST

     ఓటు హక్కు వినియోగించుకున్న గౌతు శిరీష

    పలాస నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పలాస నియోజకవర్గ అభ్యర్థి గౌతు శిరీష పలాస శాసనంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

  • 13 May 2024 10:22 AM IST

    మంగ‌ళ‌గిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. తన సతీమణితో కలిసి ఓటు వేశారు.


  • 13 May 2024 10:09 AM IST

    ఉదయం 9 గంటలకు వరకు ఎన్‌టీఆర్ జిల్లాలో 8.95 శాతం పోలింగ్ నమోదయింది. విజయవాడ ఈస్ట్‌లో అత్యధికంగా 12శాతం పోలింగ్ నమోదైంది.

  • 13 May 2024 9:46 AM IST

    ఐకాన్న స్టార్ అల్లూ అర్జున్.. జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. అనంతరం నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కోరారు.

  • 13 May 2024 9:36 AM IST

    ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కాకాణి.... నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు .సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 9:35 AM IST

    నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచి ఆనం రామనారాయణరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన నెల్లూరు నగరం సంతపేటలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


  • 13 May 2024 9:33 AM IST

    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన ఈవీఎం


    చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో ఉన్న 103 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున 7 లకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థగంట సేపు మాత్రమే ఈవీఎం పని చేసిందని, అనంతరం ఈవీఎం మోరాయించ డంతో గంటన్నర నుంచి నిరీక్షిస్తున్నట్లు ఓటర్లు తెలిపారు.

  • 13 May 2024 9:23 AM IST

    అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పసుమాముల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నా భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

  • 13 May 2024 9:21 AM IST

    తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఉన్న జగన్మాత చర్చి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటర్లను పట్టుకున్న బిజెపి నాయకులు. ఐదుగురు దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఉదయమే దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • 13 May 2024 9:19 AM IST

    వైయస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని), తన కుటుంబ సభ్యులతో కలిసి తూర్పు నియోజకవర్గం, 29, 30 బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు

Read More
Next Story