ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x

ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

Live Updates

  • 13 May 2024 3:47 AM GMT

    ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. దాదాపు ప్రతి పోలింగ్ బూత్ దగ్గరా ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటమే ఇందుకు కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్లు అధిక సంఖ్యలో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం మంచి పరిణామం అని అధికారులు అంటున్నారు.

  • 13 May 2024 3:43 AM GMT

    ఆంధ్రప్రదేశ్ గర్వనర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ మద్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

  • 13 May 2024 3:42 AM GMT

    మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ స్వగ్రామం అవును నియోజకవర్గం సదం మండలం ఎర్రాతివారిపల్లె లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

  • 13 May 2024 3:41 AM GMT

    ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి 

    ఓటరు కూడా ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, తప్పకుండా ఓటు వేయాలని కోరారు.

  • 13 May 2024 3:38 AM GMT

    చిత్తూరులో దొంగఓటు కలకలం

    కుప్పం నియోజకవర్గంలోని 163వ పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి వీలు లేకుండా చేస్తే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


  • 13 May 2024 3:34 AM GMT

    హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడలో టీడీపీ కండువా వేసుకుని ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు బాలకృష్ణా. దానిపై పలువురు చర్చించుకుంటడంతో ఓటు వేసే ముందు దానిని తొలగించారు.

  • 13 May 2024 3:26 AM GMT

    గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



  • 13 May 2024 3:24 AM GMT

    కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.. విజయనగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 13 May 2024 3:18 AM GMT

    కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గొలవూరులో వైఎస్ఆర్సిపి దౌర్జన్యం. పోలింగ్ బూత్ నుంచి టిడిపి ఏజెంట్లు బయటికి లాగే దాడి చేశారు. వైఎస్ఆర్సిపి మద్దతు ధరలు చేసిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు.

  • 13 May 2024 3:14 AM GMT

    పవన్ కల్యాణ్‌ను చిరంజీవి విష్

    జూబ్లీహిల్స్‌లోని క్లబ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

Read More
Next Story