ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.
Live Updates
- 13 May 2024 11:43 AM IST
రాయలసీమలో రెచ్చిపోతున్నముఠాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వరిల్లిన ముఠా కక్షలు. రాయలసీమలో పలు చోట్ల అల్లర్లు, కొట్లాటలు. కర్నూలు, కడప, అనంపురం, చిత్తూరు జిల్లాలలో ఈరోజు ఉదయం నుంచి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. మొత్తం 52 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమలోని నాలుగు జిల్లాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం కొట్లాటలకు దిగాయి.
- 13 May 2024 11:38 AM IST
ఆంధ్రలో ఉదయం 10 గంటల వరకు నమోదైనా పోలింగ్ శాతం
(ఉమ్మడి జిల్లాలలో)
శ్రీకాకుళం 13%
విజయనగరం 11%
విశాఖపట్నం 13%
తూర్పు గోదావరి 11%
పశ్చిమ గోదావరి 11.36%
కృష్ణా 11.24%
గుంటూరు 11.75%
ప్రకాశం 10.75%
నెల్లూరు 9.27%
చిత్తూరు 11.45%
కడప 13.01%
కర్నూలు 11.27%
అనంతపురం 11%
- 13 May 2024 11:09 AM IST
ఓటరుపై చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే
ఓటు వేయడానికి క్యూలో రమ్మన్నందుకు ఓటరుపై చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. దాంతో తిరిగి కొట్టిన ఓటరు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
- 13 May 2024 11:09 AM IST
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి రోజా సెల్వమణి
- 13 May 2024 10:51 AM IST
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట మండలం దళ్లాయి పల్లె పోలింగ్ బూత్‌పై దుండగులు దాడి చేశారు. ఈవీఎంలను బద్దలు కొట్టారు.
ఓడిపోతున్నాం అనే భయంతో, జగన్ రెడ్డి ప్రజలని ఓట్లు కూడా వేయనివ్వటం లేదు.
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం దళ్లాయి పల్లె బూత్ లో ఈవీఎం పగలుగొట్టిన వైసీపీ నేతలు#YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024 pic.twitter.com/pLZJeJGIGg - 13 May 2024 10:48 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మంచు విష్ణు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి రంగంపేటలోని జెడ్‌పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారు ఓటు వేశారు.
- 13 May 2024 10:43 AM IST
ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే
రోడ్లు, వాహనాలున్నా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఓటు వేయించడానికి ఓ వృద్ధురాలిని డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే
— Subbu (@Subbu15465936) May 13, 2024
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. pic.twitter.com/jcE158lDx0 - 13 May 2024 10:39 AM IST
మందకొడిగా సాగుతున్న ఓటింగ్ ప్రక్రియ
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మందకొడిగా సాగుతుంది. బూత్ నెంబర్ 4, 6, 7 లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దీంతో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- 13 May 2024 10:31 AM IST
నంద్యాల జిల్లాలో ఉదయం 10-00గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 11.22 శాతం
ఆళ్లగడ్డ. : 10.68 శాతం
బనగానపల్లి : 11.94 శాతం
డోన్ : 10.44 శాతం
నందికొట్కూర్ : 10.06 శాతం
నంద్యాల. : 12.42 శాతం
శ్రీశైలం. : 11.50 శాతం
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, నంద్యాల