Tirumala || జూలై మాసంలో తిరుమలలో రెండుసార్లు గరుడ వాహన సేవ..!

జులై నెలలో శ్రీవారి భక్తులకి అరుదైన అవకాశం.;

Update: 2025-07-07 00:40 GMT

తిరుమలలో జూలై మాసంలో గురు పౌర్ణమి , గరుడ పంచమి పర్వదినాల సందర్భంగా టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది.

ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతాడు. నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే నెల 29వ తేదీన గరుడ పంచమి.
ఈ పండగను పురస్కరించుకుని. మరోసారి మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై అశేష భక్తజనులను కరుణిస్తాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.


Tags:    

Similar News