1,01,899 కోట్ల పెట్టుబడులు, 85,870 మందికి ఉద్యోగాలు
విశాఖ పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) 12వ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మొత్తం రూ.1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఇవి అమలయితే 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో మొత్తం రూ.8,08,899 కోట్ల పెట్టుబడులు, 7 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్లస్టర్ వారీగా పారిశ్రామికాభివృద్ధి చేపడతామని, మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖ పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు.
మరోవైపు, తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.5,942 కోట్లతో సోలార్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ ప్రాజెక్టు. దీని ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీఐఐసీ ద్వారా 269 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పెట్టుబడులు సెమీకండక్టర్స్, రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్ ఎనర్జీ, మెటల్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాష్ట్రాన్ని ప్రముఖ స్థానంలో నిలపనున్నాయి.
ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన ముఖ్య సంస్థలు:
- రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్: రూ.202 కోట్లు - 436 ఉద్యోగాలు
- ఎపిటోమ్ కాంపోనెంట్స్: రూ.700 కోట్లు - 1,000 ఉద్యోగాలు
- ఎన్‌పీఎస్‌పీఎల్ అడ్వాన్స్ మెటీరియల్: రూ.2,081 కోట్లు - 600 ఉద్యోగాలు
- క్రయాన్ టెక్నాలజీ: రూ.1,154 కోట్లు - 1,500 ఉద్యోగాలు
- ఎస్‌సీఐసీ వెంచర్స్: రూ.550 కోట్లు - 1,130 ఉద్యోగాలు
- ఇండిచిప్ సెమీకండక్టర్స్: రూ.22,976 కోట్లు - 1,241 ఉద్యోగాలు
- ఫ్లూయింట్‌గ్రిడ్: రూ.150 కోట్లు - 2,000 ఉద్యోగాలు
- మథర్సన్ టెక్నాలజీ: రూ.110 కోట్లు - 700 ఉద్యోగాలు
- క్వార్క్స్ టెక్నోసాఫ్ట్: రూ.115 కోట్లు - 2,000 ఉద్యోగాలు
- రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్: రూ.2,172 కోట్లు - 9,681 ఉద్యోగాలు
- విశాఖ రియాల్టీ: రూ.2,200 కోట్లు - 30,000 ఉద్యోగాలు
- ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్: రూ.119 కోట్లు - 2,000 ఉద్యోగాలు
- సీల్ సోలార్: రూ.1,728 కోట్లు - 860 ఉద్యోగాలు
- నవయుగ ఇంజినీరింగ్: రూ.7,972 కోట్లు - 2,700 ఉద్యోగాలు
- మైరా బే వ్యూ రిసార్ట్స్: రూ.157 కోట్లు - 980 ఉద్యోగాలు
- విశ్వనాథ్ స్పోర్ట్స్: రూ.51 కోట్లు - 750 ఉద్యోగాలు
- సుగ్నా స్పాంజ్ అండ్ పవర్: రూ.1,247 కోట్లు - 1,100 ఉద్యోగాలు
- సూపర్ స్మెల్టర్స్: రూ.8,570 కోట్లు - 1,000 ఉద్యోగాలు
- వాల్ట్సన్ ల్యాబ్స్: రూ.1,682 కోట్లు - 415 ఉద్యోగాలు
- ఏఎమ్‌జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్: రూ.44,000 కోట్లు - 3,000 ఉద్యోగాలు
- వాసంగ్ ఎంటర్‌ప్రైజెస్: రూ.898 కోట్లు - 17,645 ఉద్యోగాలు
- బిర్లా లిమిటెడ్: రూ.240 కోట్లు - 588 ఉద్యోగాలు
- సిగాచీ ఇండస్ట్రీస్: రూ.1,090 కోట్లు - 1,250 ఉద్యోగాలు
- భారత్ డైనమిక్స్: రూ.489 కోట్లు - 500 ఉద్యోగాలు
- డాజ్కో: రూ.1,234 కోట్లు - 1,454 ఉద్యోగాలు
- శ్రీవేదా ఇన్నోవేషన్ పార్క్: రూ.12 కోట్లు - 1,500 ఉద్యోగాలు