నలుగురి ప్రాణాలు తీసిన రీల్స్ మోజు..

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌ల కోసం ప్రాణాలు పొగొట్టుకుంటున్న యువకులు..

Update: 2025-10-03 12:28 GMT
Click the Play button to listen to article

రైల్వే ట్రాక్‌పై రీల్స్(Reels) చేస్తుండగా.. రైలు ఢీకొట్టడంతో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దుర్ఘటన బీహార్ (Bihar) రాష్ట్రంలో శుక్రవారం జరిగింది. దసరా చివరి రోజు ఉత్సవాలకు హాజరయిన ఐదుగురు యువకులు తిరిగి తమ ఇళ్లకు వెళ్తూ.. పూర్ణియాలోని రైల్వే ట్రాక్‌పై నిలుచుని రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో జోగ్బానీ-దానపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat train) వారికి ఢీ కొట్టింది. రైల్వే అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వేస్ (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) తెలిపారు. జోగ్బానీ-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గత నెల సెప్టెంబర్ 15న ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News