రాహుల్ 'ఓటర్ అధికార్ యాత్ర'లో ప్రియాంక..
‘‘బీహార్‌లో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలవుతుంది.’’ - లోక్‌సభా ప్రతిపక్ష నేత;
బీహార్(Bihar)లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర'(Voter Adhikar Yatra)లో మంగళవారం వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్(Congress) నేత ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) పాల్గొన్నారు. ఆమె వెంట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇతర భారత (I.N.D.I.A) కూటమి నేతలు ఓపెన్ టాప్ జీపుపై కనిపించారు. ప్రస్తుతం యాత్ర బీహార్‌లోని సుపాల్‌లో జరుగుతోంది.
బీహార్‌లో ఎన్నికల కమిషన్ (EC) నిర్వహించిన ఓటరు జాబితా సవరణ(S.I.R)ను వ్యతిరేకిస్తూ రాహుల్ 'ఓటర్ అధికార్ యాత్ర' చేపట్టిన విషయం తెలిసిందే. 16 రోజుల పాటు 1,300 కి.మీల దూరం ఈ యాత్ర కొనసాగనుంది. ససారాం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో మెగార్యాలీతో ముగుస్తుంది.
‘త్వరలో మ్యానిఫెస్టో..’
యాత్ర విరామానికి ఒక రోజు ముందు ఆదివారం (ఆగస్టు 24) అరారియాలో రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడారు. ‘‘ఈ సారి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలవుతుంది. ప్రతిపక్ష భారత కూటమిలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయి," అని చెప్పారు.
'ఓట్లను దోచుకునే ప్రయత్నం'
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ. ఓట్లను దొంగిలించి బీజేపీకి సాయపడేందుకు ఈసీ చేసిన ప్రయత్నమే S.I.R,’’ అని రాహుల్ ఆరోపించారు.
యాత్ర ఇప్పటివరకు గయాజీ, నవాడా, షేక్‌పురా, లఖిసరాయ్, ముంగేర్, కతిహార్ పూర్నియా జిల్లాలను కవర్ చేసింది. ఇంకా మధుబని, దర్భంగా, సీతామర్హి, పశ్చిమ చంపారన్, సరన్, భోజ్‌పూర్ మరియు పాట్నా జిల్లాల మీదుగా సాగనుంది.