సమాజ నిర్మాణంలో మహిళలే ఆర్కిటెక్టులు
జాతీయ మహిళా సదస్సులో గవర్నర్ అబ్దుల్ నజీర్;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-15 10:56 GMT
"విద్య ద్వారానే మహిళలకు సాధికారత సాధ్యమవుతుంది. తద్వారా రాజకీయాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి" అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. సమాజ నిర్మాణానికి మహిళలే ఆర్కిటెక్ట్ లు అని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభివర్ణించారు. మహిళలకు గౌరవం ఇవ్వని చోట ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఫలితం ఉండబోదు అని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి నగరంలో రెండో రోజు సోమవారం పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పాల్గొనడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు. రఘువంశి జి, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ ఆర్ రఘురామకృష్ణంరాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తదితరులు స్వాగతం పలికారు.
జాతీయ మహిళా సదస్సును ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, మన వేదాలు ఉపనిషత్తులు మహిళను గౌరవించాలని సూచిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కవయిత్రి మొల్ల రాసిన రామాయణాన్ని గవర్నర్ ప్రస్తావించారు.
"తెలుగు సాహిత్యంలో మొల్ల రాయడానికి ప్రత్యేక స్థానం ఉంది". గుర్తు చేశారు. మొల్ల వంటి మహా రచయితలను కూడా గుర్తుకు చేసుకొని, ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించడానికి అవకాశాలను అందిపుచ్చుకోవాలని గవర్నమెంట్ నజీర్ కోరారు.
"మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తే అది కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు. సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మార్గం ఏర్పడుతుంది" అని గవర్నర్ అబ్దుల్ నజీర్ మహిళ గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఒక కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా గడపడం అనేది మహిళల ఆనందం పై ఆధారపడి ఉంటుంది. ఇది దేశానికి రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది అని చెబుతూ మల్ల రామాయణాన్ని ఆయన ప్రస్తావించారు.
"మహిళలకు ఆస్తిలో భాగస్వామ్యం లేకపోవడం వల్ల చాలాసార్లు తండ్రి, భర్త, సోదరుడు పై ఆధారపడతారు కోశాధిక్యత సమాజంలో వారికి ద్వితీయ స్థానం ఇచ్చారు. మహిళలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించడం ద్వారా కుటుంబ వ్యవస్థలో కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని" గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధానంగా ప్రస్తావించారు.
చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలి
మహిళలు సమాజంలో ఎన్నో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. సుప్రీంకోర్టు వెలువరించిన అనేక తీర్పుల్లో మహిళల హక్కులను కాపాడేందుకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ సమాజ నిర్మాణంలో ఆ తీర్పులు కీలక పాత్ర పోషించాyani అని ఆయన గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో
"రాజకీయం ఉద్యోగం వ్యాపార రంగంలో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారు. చట్టసభల్లో కూడా మహిళ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది" అని గవర్నర్ నజీర్ ప్రస్తావించారు. దేశంలోనే అత్యధికంగా చత్తీస్గడ్ లో 14 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. రుబండలో 30% పార్లమెంటరీ సీట్లు మహిళా కేటాయిస్తూ చేసిన చట్టం వల్ల అక్కడ కొద్ది కాలానికి వృత్తి రేటు పెరిగిందని ఆయన విశ్లేషించారు మన దేశంలోని రాజకీయాల్లో మహిళ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. దీని నుంచి మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మహిళా విద్య ద్వారానే సాధికారత సాధ్యం అవుతుందనే విషయాన్ని ఆయన మహిళలకు గుర్తు చేశారు. బాలికా విద్యను ప్రోత్సహించి, మహిళలు కూడా ఆ దిశగా ఆర్థిక సాధికారత సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, తద్వారా సమాజ పురభివృద్ధిలో భాగస్వామ్యాలు కావడానికి మరింతగా ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ సూచించారు.