అండగా ఉంటా

అచ్యుతాపురం సెజ్‌లో జరిగింది ఘోరం. ఇందులో ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2024-08-22 15:03 GMT


Delete Edit

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన, గాయాలపాలైన కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.

Delete Edit

మరణించిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. కంపెనీలో జరిగిన సంఘటనపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. బ్లాస్ట్‌ జరిగిన ఫార్మా కంపెనీలోని భవనం లోపల, బయటా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.


Delete Edit

లోపాలపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పరిశ్రమలో ఏమి జరిగిందో తెలుసుకుని తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని, శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు,

Delete Edit

క్షత గాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నామన్నారు. సేఫ్టీ ఆడిట్‌ కోసం కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. జరిగిన సంఘటన ఘోరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలో కప్పు కూలిపోయిన భాగం, కిటికీలు ధ్వసమైన ప్రాంతాలను అధికారులు చూపిస్తుండగా, అక్కడి పూర్తి వివరాలను అధికారులతో మాట్లాడుతూ కంపెనీ చుట్టు కలియ తిరిగారు. 

Delete Edit


Delete Edit


Delete Edit


Tags:    

Similar News