పిల్లలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారు

ట్రాఫికింగ్ కి గురైన 5 మంది పిల్లలను రైల్వే పోలీసులు రక్షించారు.

Update: 2025-11-09 14:50 GMT

విశాఖపట్నం (వాల్తేరు డివిజన్) రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ (CPDS) బృందం ఆపరేషన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AAHT) కింద ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. SI V. కీర్తి రెడ్డి (ఇన్‌ఛార్జ్ AHTU) నేతృత్వంలో ఈ ఆపరేషన్‌లో ట్రైన్లలో బిచ్చగాళ్లుగా ఉపయోగించేందుకు ట్రాఫికింగ్ కి గురైన  5 మంది పిల్లలను రక్షించారు. అదే సమయంలో పిల్లల అపహరణకు పాల్పడుతూ బిచ్చగాళ్లుగా మార్చుతున్న ఇద్దరు మహిళా ట్రాఫికర్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో జరిగింది. టిప్-ఆఫ్ ఆధారంగా జరిపిన ఈ ఆపరేషన్‌లో అరెస్టైన వారు సుధా కుమారి అలియాస్ షాంతా, సుఖ్ బాయి ధాడి గా గుర్తించారు. 

ఈ ముఠా పిల్లలను అపహరించి వారిని బిచ్చగాళ్లుగా ట్రైన్లలో ఉపయోగిస్తున్నారు అని స్పష్టమైన సమాచారం ఆధారంగా దాడులు చేపట్టారు. రక్షించిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి అప్పగించి, తదుపరి చర్యలు చేపట్టారు. అరెస్టైన ట్రాఫికర్లపై IPC సెక్షన్లు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  RPF జాతీయ స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.  రైళ్లల్లో మానవ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు RPF దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. SI కీర్తి రెడ్డి నేతృత్వంలోని బృందం గతంలోనూ ఇలాంటి ఆపరేషన్లలో విజయవంతంగా నిర్వహించారు. అందులో భాగంగా 2024లో 11 మంది బాలికలకు విముక్తి కలిగించారు. 

Tags:    

Similar News