ఈ మాజీ మంత్రులు ఎక్కడ? వారి మాటా బంగారమాయో..!

జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు కనిపించడం లేదు. వారి మాటలు వినిపించడం లేదు. నిత్యం జనంలో తిరిగిన వారిద్దరూఎక్కడ ఉన్నారు. ఇది టీడీపీకి విమర్శనాస్త్రంగా మారింది.

Update: 2024-08-06 06:47 GMT

చిత్తూరు జిల్లాలో ఆ మాజీ మంత్రులది విలక్షణ శైలి. ఒకరికి కాలు ఒక చోట ఆగేది కాదు. నిత్యం జనం మధ్యలో తిరిగేవారు. మరో మాజీ మహిళా మంత్రి నిత్యం మాటలతో దాడి చేయడంలో దిట్ట. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వారి మాటలే వినిపించడం లేదు. వారిలో ఒకరు మౌనవ్రతం పాటిస్తున్నట్లు నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. మాజీ మహిళా మంత్రి మాత్రం విదేశాల్లో సేదదీరుతున్నారు. వీరద్దరినీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వదలడం లేదు. ఫైర్ బాండ్ గా మాటలు సంధించిన రోజా ఫొటోలు ఎక్స్ వేదికగా షేర్ చేసి, విమర్శలు సంధిస్తున్నారు.


చిత్తూరు జిల్లా నగిరి అసెంబ్లీ స్థానం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యట్రిక్ సాధించాలని ఆశించిన సినీనటి, మాజీ మంత్రి ఆర్కే. రోజాకు అసమ్మతి గండికొట్టంది. అందరి సహకారంతో ఆమె 2014 ఎన్నికల్లో858 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. 2019లో 2,007 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో మా.జీ మంత్రి రోజాపై, టీడీపీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్ 45,004 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
టీడీపీ నుంచి మొదట ఆమె చంద్రగిరి, ఆ తరువాత నగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. దివంగత సీఎం వైఎస్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలు సమీపించిన వేళ వైఎస్ఆర్ సీపీలో చేరి, నగరి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. నగరిలో సాగించిన భూ వ్యవహారాలు, ఒంతెత్తు పోకడల నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీలోకి వెళ్లిన వైఎస్ఆర్ సీపీ కీలక నేతలందరూ ఆమెను ఓడించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎఎస్ఆర్ సీపీలో ఫైర్ బాండ్ మాజీ మంత్రి రోజా అడ్రస్ లేరు. ఎన్నికల ఫలితాల తరువాత ఆమె మద్రాస్ కు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో తమను పట్టంచుకునే వారు లేకుండా పోయారని కార్యకర్తలు కూడా నిరసిస్తున్నారు. సీన్ కట్ చేస్తే..

మాజీ మంత్రి ఆర్కే. రోజా విదేశీపర్యటనల్లో ఆహ్లాదంగా కాలం గడుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీ వెళ్లారని కొందరు, ఇంగ్లాండ్ లో ఉన్నారని ఇంకొందరు చెప్పకుంటున్నారు. మినహా ఆమె ఎక్కడున్నారనేది స్పష్టత లేదు.
మా అక్క సూపర్..


నెల్లూరు పెద్దరెడ్ల మాటల స్టయిలే వేరు. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో వారికి వారే సాటి. ఆ కోవలోని వ్యక్తుల్లో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంటకరమణారెడ్డి కూడా ఒకరు. తన ట్రిట్టర్ (ఎక్స్) వేదికగా "మా అక్క సూపర్" అంటూ రోజా ఫొటో షేర్ చేశారు. దీంతో రోజా విదేశీ పర్యటనలో ఉన్నారనే విషయం తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అన్ని ప్రభుత్వ వ్యవహారాలపై కూటమి కూపీ లాగుతోంది. ఈ తలనొప్పి ఎందకు అనుకున్నారో.. ఏమో.. మాజీ మంత్రి రోజా విదేశాల్లో సరదాగా కాలం వెళ్లబుచ్చుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి ట్రీట్ కు మరో ఆసక్తికకరమైన రీట్వీట్ కూడా కనిపించింది. "అధికారంలో ఉంటే పర్యాటక మంత్రి, అధికారంలో లేకుంటే.. విదేశాల్లో పర్యటన" అని ఓ రాజకీయ ఔత్సాహికుడు కామెంట్ చేశారు.
పెద్దన్న మౌనవ్రతం..
జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నంబర్- 2గా వ్యవహరించారు. పుంగనూరు నుంచి నాలుగుసార్లు, పీలేరు నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఫలితాల తర్వాత ఆయన నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, నిత్యం ప్రజల్లో తిరుగాడే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం బయట కనిపించడం లేదు. ఆయన మాటలు ఎక్కడ వినిపించని పరిస్థితి నెలకొంది. తన రాజకీయ జీవితంలో మొదటిసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటున్న అనూహ్యమైన పరిస్థితి ఇది.
ఇందుకు ప్రధాన కారణం...


ఇదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి తోపాటు కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సోదరుడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి భూముల వ్యవహారాల్లో చిక్కుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 22ఏ, జమీందారీ, అసైన్ భూముల కొనుగోలుకు సంబంధించిన ఫైళ్లు దహనమయ్యాయి. మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గం, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం ఆయనను వివాదాల్లోకి లాగింది. దీంతో ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది తెలియని పరిస్థితి. దీనిపై కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డికి రాజకీయ విమర్శనాస్త్రంగా లభించింది. "పాపాల పెద్దిరెడ్డి అంటూ" భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. దానిని ఆనం వెంకట రమణారెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సాధారణ స్థితికి చేరే వరకు వారు జనాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది వేచిచూడాలి.
Tags:    

Similar News