ఈ–ఆఫీస్‌లో ఏమి జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌ ఈ–ఆఫీసు వ్యవస్థలో ఏమి జరుగుతోంది. ఎందుకు చంద్రబాబు ఈ వ్యవస్థ అప్‌గ్రేడేషన్‌ను వద్దంటున్నారు.

Update: 2024-05-19 03:13 GMT

ఈ–ఆఫీసు అంటే ఎలక్ట్రానిక్‌ ఆఫీసు. దీని ద్వారానే ప్రభుత్వ పేమెంట్లు జరుగుతుంటాయి. రకరకాల వెబ్‌సైట్లు కూడా ఈ–ఆఫీసు వ్యవస్థలోనే పని చేయాల్సి ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ప్రక్రియలు, సేవల పంపిణీలో పారదర్శకత, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఈ–ఆఫీసు వ్యవస్థ ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌(ఎన్‌ఐసి) పర్యవేక్షణలో నడుస్తుంది. ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేయాలని గతంలో ఉన్న వర్షన్స్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా జరగాలంటే ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేయడానికి కేంద్ర ఎన్‌ఐసీ బృందం ఈ నెల 17 నుంచి 25 వరకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిచ్చిన షెడ్యూల్‌ను అంగీకరించింది. ఇవే తీదీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కేరళా, రాష్ట్రాల్లో సీబీఎస్సీ వంటి సంస్థల్లోను షెడ్యూల్‌ను కేంద్రం ఇచ్చింది. పాత వర్షన్స్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించాల్సి ఉంది. ఈ సవరణలను ఎన్‌ఐసీ నిలపి వేసింది. దీంతో తాజాగా ఈ–ఆఫీసును 7.“కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో కొత్త ఫీచర్లను ఉపయోగించి 14 రాష్ట్రాలు ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి.

సమస్య ఏమిటి?
ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్‌ చేస్తే గతంలో అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌లో ట్యాంపరింVŠ జరిగే అవకాశం ఉందని, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియను నిలపి వేయాల ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ–ఆఫీసు అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈ అవకతవకలు తెలియాలంటే త్వరలో వచ్చే కొత్త ప్రభుత్వం ఈ–ఆఫీసును చెక్‌ చేసిన తర్వాత అప్‌గ్రేడేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టడం మంచిదని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ విభాగం కార్యదర్శి కోన శశిధర్‌ ఏమన్నారంటే.. ఈ–ఆఫీసు ఫైల్స్‌ అత్యంత భద్రతతో కూడిన ఎన్‌క్రిప్టిడ్‌ ఫార్మేట్‌లో నిల్వ ఉంటాయని, ఏదైనా విపత్తులు సంభవిస్తే బ్యాక్‌అప్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఒక్క సారి ఈ–ఫైల్‌లోకి సమచారం చేరితే ఫైల్‌ను తొలగించడం, మార్పులు చేయడం అసాధ్యం. ఎన్‌ఐసీ వారు నిర్వహించే డేటా బేస్‌ శాశ్వతంగా నిల్వ ఉంటుంది. వాటిని మార్చేందుకు వీలు కాదు. అపోహలు, నిరాధారమైనవి, అవాస్తవమైనవి.
Tags:    

Similar News