Water-saving In tIrumala | తిరుమల గోగర్భండ్యాం వద్ద జలహారతి

తిరుమలలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తుఫాన్ వల్ల కురిసిన వర్షాల వల్ల రానున్న వేసవిలో నీటి కష్టాలు గట్టెక్కించింది.;

Update: 2024-12-05 14:36 GMT

తిరుమ‌ల‌లో కురిసిన వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాల్లో నీటి నిల్వ‌లు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. దీంతో గోగ‌ర్భం డ్యామ్ (Gogarbham Dam) వ‌ద్ద గురువారం టీటీడీ ( TTD) ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ బిఆర్‌.నాయుడు, అద‌న‌పు ఈఓ సిహెచ్‌.వెంక‌య్య చౌద‌రి పూజ‌లు నిర్వ‌హించారు. ఆ తరువాత జ‌లహార‌తి స‌మ‌ర్పించారు. ఏటా వర్షాకాలంలో జలశయాలు నిండితే, జలహారతి సమర్పించడం ఆనవాయితీ. దీంతో సాయంత్రి ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.



ఇటీవల కురిసిన వర్షాలతో తిరుమలలోనే కాకుండా జిల్లాలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. దీంతో సాగు (Drinking), సాగు (Irrigetion) నీటి కొరత లేకుండా పోయింది. ప్రత్యేకంగా కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు (Waterfollow's) కనివిందు చేస్తున్నాయి. అందులో,

తిరుమల కొండపై ఉన్న గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం జలాశయాల్లో నీరు సమృద్ధిగా నిలిచింది. దీంతో మూడు రోజుల కిందటే, గోగర్భం డ్యాం క్రస్ట్ గేట్లు మూడు అడుగుల మేరకు పైకి లేపి మిగులు జరాలను దిగు ప్రాంతానికి వదులుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు 60 నుంచి 80 వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కొండపై ఉన్న హోటళ్ళు, అన్నదాన సత్రం, సాధారణ యాత్రికులు తో కలిపి సుమారు లక్ష మంది వరకు ఒక రోజుకు సందర్శిస్తూ ఉంటారు. తిరుమలలో యాత్రికులతో పాటు సాధారణ పౌరులకు, స్థానికుల రోజువారి నీటి అవసరాలు కోసం కొండపై ఉన్న జలాశయాల తోపాటు చంద్రగిరికి సమీపంలోని కల్యాణిడ్యాంపైనే ఆధారపడతారు. ఈ జలాశయాలన్నీ నిండుగా మారాయి. దీంతో,
టీటీడీ వేద పండితులు బుధవారం గోగర్భం డ్యాం వద్ద జలహారతి సమర్పించారు. పువ్వులు, పండ్లు, చీర, పసుపు, కుంకుమ వంటి పూజా వస్తువులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తోపాటు అధికారులు ఈ పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మకు సారే సమర్పించి, పూజలు చేశారు. పూలదండలు, పసుపు, కుంకుమలు నీటిలో వదిలి గంగమ్మకు పూజాదికాలు అందించారు.

మళ్లీ వర్షాలు కురిస్తే శేషాచలం అడవులు మధ్య కొండలను అనుసంధానం చేస్తే కుమారధార- పసుపుధార జంటప్రాజెక్టుల్లోకి (twin projects In sheshachalam Forest)) కూడా నీరు చేరింది.
"మ‌రోసారి వ‌ర్షాలు కురిస్తే, ప‌డితే కుమార‌ధార‌, ప‌సుపుధార డ్యామ్"లు కూడా నిండిపోతాయ‌ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో రోజుకు 50 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటిని వాడుతున్నామని తెలిపారు. ప్ర‌స్తుతం జలాశయాల్లోని నీటి నిల్వ‌లు 300 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయ‌ని తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శాంతారామ్‌, డిప్యూటీ ఈఓ లోక‌నాథం, వాట‌ర్ వ‌ర్క్స్ ఈఈ సుధాక‌ర్‌, వీజీఓ సురేంద్ర‌, అధికారులు పాల్గొన్నారు.

జలశయాల్లో నీటి నిలువలు
తిరుమలలోని ఐదు జలశాయాలు కళకళలాడుతున్నాయి. వాటిల్లో గురువారం సాయంత్ర 4 గంటలకు జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.05 మీటర్లు
FRL (Full reservoir level) : 697.14 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం : 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ : 5208.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
2) గోగర్భం డ్యామ్ : 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీటర్లు
FRL :- 865.00 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం : 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
4) కుమారధార డ్యామ్ :- 896.50 మీటర్లు
FRL :- 898.24మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 3724.43 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీటర్లు
FRL :- 898.24 మీటర్లు
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు
ప్ర‌స్తుత నిల్వ :- 966.31 ల‌క్ష‌ల గ్యాలన్లురాను
Tags:    

Similar News