ఉగ్రవాదుల తూటాలకు బలైన విశాఖ వాసి
చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు.;
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జేఎస్ చంద్రమౌళి, సోమిశెట్టి మధుసూదన్ రావు బలయ్యారు. వీరికి సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. వీరిలో జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నంకు చెందిన వారు. సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి హుటాహుటిన విశాఖపట్నంకు బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాదుల దాడిలో అన్యాయంగా దుర్మరణం పాలైన జేఎస్ చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరణించిన మురళి గురించి ఆరా తీస్తున్నారు. వారి కుటుంబం గురించి వివిరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మురళి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు.
మంగళవారం కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో ఘటనా స్థలం నుంచి విశాఖపట్నంకు తరలించనున్నారు. మురళి మృతదేహం మరి కాసేపట్లో విశాఖపట్నంకు చేరుకోనుంది. రేపు ఉదయం చంద్రమౌళి అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం జరిగే చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉందని, దీని కోసం బుధవారం రాత్రి విశాఖలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నట్లు తెలిసింది.
మధుసూదన్ రావు బెంగళూరులో ఉంటున్న ఐబీఎం ఉద్యోగి. ఆయన కావలి పట్టణానికి చెందిన వారని తెలిసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.