సజ్జల సన్నిహితులు మోసం చేశారని లోకేష్‌కు ఫిర్యాదు
విచారించి న్యాయం చేయాలని మన్నె సుబ్బారావు అనే బాధితుడు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశాడు.;
వైసీపీ స్టేట్ కోఆర్డినేట్ సజ్జ రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారంటూ ఓ బాధితుడు మంత్రి నారా లోకేష్‌ను ఆశ్రయించాడు. తనకు నాయ్యయం చేయాలని ఆ బాధితుడు లోకేష్‌కు విజ్ఞప్తి చేశాడు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి మంత్రి నారా లోకేష్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుల చేతిలో తాను మోసపోయానిని, విచారించి తగిన న్యాయం చేయాలి అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు అనే బాధితుడు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
తన కుమారుడికి మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు తనన మోసం చేశారని బాధితుడు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, వాడపాలెంకు చెందిన అడపా ప్రేమ్‌చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి అనే సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులు తన కుమారుడికి మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తామని చెప్పి వద్ద రూ. 1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని లోకేష్ వద్ద వాపోయాడు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో సీటు ఇప్పిస్తామని రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని, అయితే అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో అంత కంటే తక్కువ ఇస్తే బెంగుళూరులోని రామయ్య మెడికల్ కళాశాలలో సీటు ఇప్పిస్తామని చెప్పారని, వారి మాటలు నమ్మి రూ. 1.20 కోట్లు వారికి ఇచ్చానని, అయితే మెడికల్ పీజీ అలాట్‌మెంట్‌కు సంబంధించి నకిలీ లెటర్‌ను తన చేతిలో పెట్టి రూ. 1.20 కోట్లు తీసుకొని తనన మోసం చేశారని, నగదు తిరిగి ఇవ్వాలని కోరితే సజ్జల పేరు చెప్పి బెరిస్తున్నారని, దీనిని విచారించి తమకు రావాల్సిన నగదును తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాలని బాధితుడు మన్నె సుబ్బారావు మంత్రి లోకేష్‌ను వేడుకున్నాడు. ఈ ఫిర్యాదును తీసుకుని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ న్యాయం చేస్తామని బాధితుడు మన్నె సుబ్బారావుకు హామీ ఇచ్చారు.