టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే : సీఎం చంద్రబాబు ట్వీట్‌

మాజీ సీఎం జగన్‌ తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-27 10:33 GMT

ఎన్నడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ మత రాజకీయాలు బగ్గు మన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీటీడీలో వెలసిన బోర్డు కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది.

సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ వేంకట్వేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుమలకు వెళ్లే వారికి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేస్తూ ట్వీట్‌ చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువులకు అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతీ భక్తుడూ అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. స్వామివారి సన్నిధికి వెళ్లే వారు ఆలయ నియమాలు, ఆగమశాస్త్ర ఆచారాలు, టీటీడీ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరుతున్నా. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః‘ అంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల దర్శనానిక వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.
టీటీడీలో కూడా ఆకస్మాత్తుగా ఒక బోడ్డు కూడా వెలసింది. ఎన్నడు లేని విధంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. అందులో ఏముందంటే.. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయములో హైందవేతరులు ఆలయ ప్రవేశం గురించి అని పెద్ద అక్షరాలలో హెడ్డింగ్‌ ఉంది. వాటి కింద జీవో ఎంఎస్‌ నంబరు 311 రెవిన్యూ ఎండోమెంట్స్‌– 1 విభాగం, తేదీ 09–04–1990 ప్రకారము అని బ్రాకెట్‌లో ఉంది. ఆ తర్వాత 136, తిరుమల తిరుపతి దేవస్థానములు ఆలయములు కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశము హిందువులకు ఒక హక్కులాంటిది. అయినప్పటికి హైందవేతరులు( రెడ్‌ కలర్‌లో) ఆలయ ప్రవేశము చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వరుని పట్ల విశ్వాసం మరియు గౌరవము ఉన్నట్లు ఒక ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ ధ్రువీకరణ పత్రములు(రెడ్‌ కలర్‌లో)తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు/అదనపు కార్యనిర్వహణాధికారి వారి క్యాంపు కార్యాలయం/రిసెప్షన్‌ కార్యాలయములు/అని ఉప విచారణ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అనేది దీని సారాంశం.
Tags:    

Similar News