తిరుమల ప్రకంపనలు తమిళనాడుకు వ్యాపించాయా!

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాట డెయిరీలో నెయ్యి, కొన్ని ఆలయాల్లో ప్రసాదాలను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-09-21 11:19 GMT

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వుతో కూడిన నెయ్యి వినియోగించారనే ఆరోపణలు పెను దుమారం లేపుతున్నాయి. ఈ ప్రభావం తమిళనాడులో కూడా ఎక్కువ చూపించినట్లు సమాచారం అందింది. తమిళనాడు ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వాడుతున్న నెయ్యి కూడా కల్తీ జరిగి ఉంటుందనే సందేహతో ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దిండిగల్ డెయిరీలో కూడా తనిఖీ చేశారు. అంతేకాకుండా తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వాడుతున్న నెయ్యిని పరిశీలించినట్లు కూడా సమాచారం అందింది.


తిరుమల ఎఫెక్ట్

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్, కిర్పారాం డెయిరీ ప్రయివేటు లిమిటెడ్ తోపాటు తమిళనాడు రాష్ట్రం దిండిగల్ సమీపంలోని ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా నెయ్యి సర్ఫ్రా అవుతున్న విషయం తెలిసిందే.
తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్స్ పరిశ్రమ నుంచి అందిన నెయ్యిలో నాణ్యత లోపించింది అనే విషయం అదికారులు బహిర్గతం చేశార. అంతేకాకుండా,

సీఎం ఆరోపణ.. ఈఓ నిర్ధారణ

"నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కల్కి చేశారు" అని ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. " గుజరాత్ లోని ఎన్డీడీబీ సహకార సంస్థ ల్యాబ్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు" టీటీడీ ఈవో జే. శ్యామల రావు స్పష్టం చేశారు. "దిండిగల్ లోని ఏ ఆర్ డైరీ మిల్క్ ఫుడ్స్ సంస్థ కు షోకాజ్ నోటీసు ఇచ్చాం. వారు పంపిన రెండు ట్యాంకర్ల నెయ్యిని కూడా తిరస్కరించాం" అని రెండు నెలల క్రితం, మళ్లీ తాజాగా శనివారం టీటీడీ ఈఓ జే. శ్యామలరావు స్పష్టం చేశారు.
తమిళనాడులో అలర్డ్
తాజాగా రాష్ట్రంలో దుమారం రేగడానికి తమిళనాడులోని సంస్థను బూచిగా నిలిపారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిండిగల్ లోని ఏఆర్. మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసి, ప్రసాదాలు తయారీపై ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ శాఖ దృష్టి నిలిపింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది. అందులో గొడ్డు కొవ్వు ఉందనే ఆరోపణలు, ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు స్పష్టం చేసిన పరిస్థితుల్లో...
తమిళనాడులో ఉన్న ప్రధాన దేవాలయాలకు దిండిగల్ లోని ఏఆర్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసే నెయ్యతో ప్రసాదాల తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, దేవాదాయం శాఖ అధికారులు వేర్వేరుగా వారి పరిధిలో తనిఖీలు చేయడంతో పాటు, ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్న ఆలయాల్లో ప్రసాదాల తయారీని నిలిపివేసినట్లు సమాచారం అందింది.

మేము నేరుగా విక్రయించం

తమిళనాడులోని ఆలయాలకు నేరుగా నెయ్యి విక్రయించడం లేదని దిండిగల్ లోని ఏఆర్ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీనియర్ మేనేజర్ పాండియన్ పెరుమాళ్ తెలిపారు.
"మా డైరీ నుంచి డీలర్లకు పాలు, పెరుగు నెయ్యితో పాటు ఐస్ క్రీములు సరఫరా చేస్తాం" అని ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే..
"తమిళనాడులో మాకు 400 మంది డీలర్లు ఉన్నారు. వారికి మా సంస్థ నుంచి ఉత్పత్తులు సరఫరా చేస్తాం" డీలర్ల నుంచి ఆలయాల పాలకమండలు అధికారులు నెయ్యి కొనుగోలు చేసి ఉండొచ్చేమో మాకు తెలియదు" పని ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే


"తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లోపిచ్చిందని విషయంపై షోకాజ్ నోటీస్ అందింది" అని స్పష్టం చేశారు. " అందులో గొడ్డు కొవ్వు కలిసిందనే విషయంపై ఎలాంటి నివేదిక అందలేదు. అది పూర్తిగా అవాస్తవం. టీటీడీ చెబుతున్న వివరాల్లో వాస్తవికత లేదు" అని పాండియన్ తేల్చి చెప్పారు.
"టీటీడీ నుంచి అధికారికంగా మాకు ఆ విషయంపై పత్రాలు అందితే, తదుపరి ఇలాంటి చర్యలు తీసుకోవాలి, స్పందించాలనే విషయంపై స్పష్టంగా ఉన్నాం" అని పాండియన్ వివరించారు. ఈ విషయంలో ఏ ఆర్ డైరీ ఫుడ్స్ యజమాని రాజశేఖర్ స్పందించారు. మా సంస్థ ప్రతిష్ట, వ్యాపార నిబద్ధత కాపాడుకోవడానికి యాజమాన్యం వెనకడుగు వేయదు" అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు రెండు లక్షల లీటర్ల పాలు సేకరించడం ద్వారా ఏఆర్ డైరీ ఫుడ్స్ ఆహార ఉత్పత్తులతో పాటు నెయ్యి తయారీలో కూడా అగ్రగామిగానే ఉందని ఆయన చెబుతున్నారు.
ఇంతవరకు తమ సంస్థపై ఎలాంటి ఆరోపణలు. తాజాగా వస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలపై టీటీడీ నుంచి లేఖ అందిన తర్వాత మా స్పందన కూడా సీరియస్ గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దీనిపై చెన్నై కేంద్రంగా పనిచేసే ఓ జర్నలిస్టు స్పందించారు. "తమిళనాడులోని ప్రధాన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అవిన్ సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరుగుతుంది" అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి తిరుమల కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలతో రాయి చేసిన అగ్గి మంటలు దేశవ్యాప్తంగా అల్లుకున్నాయి. టీటీడీ స్పందన తర్వాత తమిళనాడు ఏ ఆర్ ఫుడ్స్ డైరీ ప్రతినిధులు స్పందిస్తారనేది వేచి చూడాలి.
Tags:    

Similar News