తిరుమల: శ్రీవారి ఉత్సవాల క్యాలెండర్ విడుదల
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.;
By : SSV Bhaskar Rao
Update: 2025-06-25 07:08 GMT
తిరుమలలో ఏడాది జూలై నెలలో నిర్వహించే ఉత్సవాల క్యాలెండర్ను టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏడాది పొడవునా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయాత్పుర సేవలు నిరంతరం సాగుతూ ఉంటాయి.
ప్రతి నెల నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా క్యాలెండర్ రూపంలో టిటిడి ఆగమ పండితులు, వేద పండితులు నిర్ణయిస్తారు.
జూలై నెలలో నిర్వహించే ఉత్సవాలు.
జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర.
6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
10న గురు పౌర్ణమి గరుడసేవ.
16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.
25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.