ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు

కొలీజియం సిఫార్సు చేసిన చాలా కాలం తర్వాత ఇప్పుడు అనుమతి.. ఎవరా ముగ్గురు, ఏమా కథ..

Update: 2025-10-14 13:51 GMT
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు వస్తున్నారు. కొలీజియం సిఫార్సు మేరకు వీరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ముగ్గురు ఎవరెవరంటే.. గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ దోనాది రమేష్‌, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుబేందు సమంత.
ఈ ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
జస్టిస్ చీకటి (Cheekati) మానవేంద్రనాథ్ రాయ్ (Justice C. Manavendranath Roy). విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన వారు. ఆయన గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. 1964 మే 21న జన్మించారు. Parvathipuram & Vizianagaram ప్రాంతాల్లో 1988–2002 మధ్య అడ్వకేట్ గా ప్రాక్టీసు చేశారు. 12 జూన్ 2019న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి జస్టిస్ గా బాధ్యతలు చేపట్టారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
జస్టిస్ దోనాది రమేష్ జూన్ 27, 1965న చిత్తూరు జిల్లాలోని కమ్మపల్లి గ్రామంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నెల్లూరులోని వి.ఆర్. లా కాలేజీ నుండి 1987-90 వరకు బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ పొందారు. 1990లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆయన అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు.
జస్టిస్ సుంభేంద్రు సమంత (Justice Subhendu Samanta) 25 నవంబర్ 1971న పశ్చిమ బెంగాల్ లో జన్మించారు. కోల్ కతా యూనివర్శిటీలో లా విద్యను అభ్యసించారు. Tamluk డిస్ట్రిక్ట్ కోర్టులో Advocate గా ప్రాక్టీస్ చేశారు. Calcutta High Court లో అదనపు జడ్జిగా నియమితులై ఆ తర్వాత పర్మినెంట్ జడ్జిగా ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా వస్తున్నారు.
Tags:    

Similar News