3 గంటలకు పెడితే 3లక్షల మంది చూశారు
గూగుల్ గురించి సీఎం చంద్రబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్టు బాగా వైరల్ గా మారింది. మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఒకే ఒక లైన్ తో ఎక్స్ వేదికగా పెట్టిన చేసిన ఆ పోస్టు సుమారు 3 లక్షల మందికిపైగా చూశారు. ప్రముఖ సంస్థ గూగుల్ తో ఒప్పందం చేసుకున్న అనంతరం ఆ సంతోషాన్ని తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. Okay Google, sync for Viksit Bharat... అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'OK Google' అనేది గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)ను ప్రారంభించే ప్రధాన వాయిస్ ట్రిగ్గర్ (voice trigger) లేదా హాట్‌వర్డ్ (hotword). ఇది గూగుల్ వాయిస్-ఆధారిత ఏఐ అసిస్టెంట్ అయిన Google అసిస్టెంట్ ను మేల్కొపడానికి, సంభాషించడానికి ఉపయోగించే వాయిస్ కమాండ్. ఇలా గూగుల్ ట్రిగ్గర్ వాడి సీఎం చంద్రబాబు చేసిన పోస్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంటోంది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారింది. మూడు లక్షల పదహారువేల ఆరు వందల మంది దీనిని చూశారు. దీంతో పాటుగా GoogleComesToAP అని పోస్టు చేయడం, దానికి హ్యాష్ ట్యాగ్ చేయడం, దీనిని పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలకు, తన కుమారుడు మంత్రి నారా లోకేష కు ట్యాగ్ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Okay Google, sync for Viksit Bharat...
— N Chandrababu Naidu (@ncbn) October 14, 2025
#GoogleComesToAP @AshwiniVaishnaw@nsitharaman@naralokesh @bikashkoley73@ThomasOrTK @Google pic.twitter.com/WtQNAQ8Gjg