తిరుమల Breaking : గరుడసేవకు ఎన్ని లక్షల మంది హాజరయ్యారో.. తెలుసా..

శ్రీవారి గరుడసేవ కనుల పండువగా సాగుతోంది. తిరుమలగిరులన్నీ తీర్థభక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Update: 2024-10-08 17:39 GMT

తిరుమల క్షేత్రం యాత్రికులతోె కిక్కిరిసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన గరుడసేవతో తీర్ధభక్తులతో ఇసుక వేస్తే రాలనంతగా మారింది.


దాదాపు 3.5 లక్షల మంది భక్తులు హాజరై ఉంటారని టీడీపీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం రాత్రి 10.45 గంటలకు తిరుమలలో ప్రకటించారు. ఇప్పటికి నాలుగు గంటలుగా శ్రీవారి తన ఇష్టసేవకుడు గరుడుడిపై ఆశీనులైన వాహనంపైై ఊరేగుతున్నారు. ఇంకో గంటపాటు ఈ గరుడసేవ జరిగే అవకాశం ఉంటుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు.


తిరుమలలో గరుడోత్సవాన్ని చూసి, జన్మ తరించాలని భక్తులు భావిస్తారు. దీానికోసం తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి అశేషంగా గోవిందమాలధారణ భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గ్యాలరీలు కిటకిటలాడాయి.

అదే విధంగా బ్రహ్మోత్సవం తిరుపతి వాసులకు పెద్ద పండుగ లాంటిది. గరుడోత్సవం రోజు ప్రతి ఇంటి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివెళతారు. దీంతో తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడుతోంది. అదే విధంగా తిరుమల మొత్తం పాదం మోపడానికి కూడా వీలులేనంతగా యాత్రికులతో నిండింది.

తిరుమల క్షేత్రం మొత్తం భక్తులతో నిండిపోయింది. తిరుమల రెండు ఘాట్ రోడ్లను అధికారులు తెరిచి ఉంచారు. తిరుమలకు వెళ్లే వారితో పాటు, గరుడోత్సవంలో తరించిని భక్తులను తిరుపతికి తరలించడానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో జరుగుతున్న గరుడోత్సవ వైభవానికి అద్దం పట్టే చిత్రాలు ఇవి. 

 


శ్రీవారి అలంకారంలో...


రుక్మిణీ సమేత సత్యభామతో..

 




తీర్థభక్తులతో నిండిన తిరుమల

 




 



 




Tags:    

Similar News