ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఈ సదస్సు ఆహ్వాన పత్రాల్లో ఆయన పేరుంది. దీంతో పవన్ వస్తారని జనసైనికులతో పాటు పలువురు అనుకున్నారు. కానీ శనివారం ప్రారంభమైన సదస్సులో మాత్రం పవన్ జాడ కానరాలేదు. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారు. ప్రోటోకాల్‌లోనూ ఆయనది రెండో స్థానమే. అయితే ఈ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఎందుకు రాలేదన్న దానిపై జనసేన, టీడీపీ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సమ్మిట్‌కు సాక్షాత్తూ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మలు వచ్చారు. వీరంతా కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలకు చెందిన వారే. వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో మంత్రులు డజను మందికి పైగా హాజరయ్యారు. 72 దేశాల నుంచి మంత్రులు, రాయబారులు, ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. సాక్షాత్తూ ఉప రాష్ట్రపతి హాజరైన ఈ కీలక సదస్సుకు పవన్ ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమ్మిట్‌పై పవన్‌కు సదాభిప్రాయం లేదా?
పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై పవన్‌కు సదాభిప్రాయం లే§ న్న వాదన వినిపిస్తోంది. పార్టనర్‌షిప్ సమ్మిట్ గురించి దేశ విదేశాల్లో రోడ్డు షోలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు వెళ్లారు. అప్పట్లో కూడా పవన్ వారి వెంట వెళ్లలేదు. ఆది నుంచి పవన్ కల్యాణ్‌కు ఇలాంటి సమ్మిట్ల పట్ల సానుకూల ధృక్పథం లేదని, అందువల్లే ఆయన మొన్న రోడ్డు షోలకు గాని, నేటి సమ్మిట్‌కు గాని హాజరు కాలేదని జనసేనలో పేరు రాయడానికి ఇష్టపడని ఒక సీనియర్ నేత ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు. ఇలాంటì పెట్టుబడుల సదస్సు ఓ ప్రహసనమన్న భావనతోనే ఆయన ఈ సమ్మిట్‌కు హాజరు కాకపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ విశాఖలో జరుగుతున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు హాజరు కాకపోవడం వెనక తలో విధంగా చర్చించుకుంటున్నారు.
తండ్రీ కొడుకులే అన్న తామై..
ఇక పార్టనర్‌షిప్ సమ్మిట్ విషయంలో తండ్రీకొడుకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్‌లే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వేదికపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు, లోకేష్‌లను పొగడ్తలతో ముంచెత్తారు.
సమ్మిట్‌లో లోకేష్ పక్కన కేటాయించిన సీటులో కూర్చున్న మనోహర్
వేదికపై నాదెండ్ల మనోహర్‌కు చోటు..
భాగస్వామ్య సదస్సుకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోయినా కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మాత్రం హాజరయ్యారు. వీరిలో నాదెండ్ల మనోహర్‌కు వేదికపై లోకేష్ పక్కన సీటు కేటాయించారు. అదే పవన్ వచ్చి ఉంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన చోటు కల్పించే వారు. కాగా ఉమ్మడి విశాఖ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం సదస్సుకు హాజరయ్యారు.
సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్
కొణతాల కుమార్తె వివాహ వేడుకకు రావలసి ఉన్నా..
అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుక శుక్రవారం విజయనగరం జిల్లా భోగాపురం సన్‌రే రిసార్టులో జరిగింది. ఆ వేడుకకు పవన్ కల్యాణ్ రావలసి ఉంది. ఆయన వస్తారని కొణతాల రామకృష్ణ కూడా నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ వివాహానికి కూడా పవన్ రావడం మానేశారు. శుక్రవారం నాడే విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. కొణతాల కుమార్తె వివాహ వేడుకకు హాజరై విశాఖలోని పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు రాకపోతే రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ వేరే సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ రాలేదని చెబుతున్నారు. మొత్తమ్మీద విశాఖలో జరుగుతున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పవన్ ౖVð ర్హాజర్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.