అప్పడు పీ3 తెచ్చా..ఇప్పుడు పీ4 తెస్తున్నా : సీఎం చంద్రబాబు
ఏ సమావేశంలోనైనా ఐటీ గురించి, హైటెక్ సిటీ గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించకుండా ఉండరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లోనే పబ్లిక్, పైవేటు(పీపీపీ) పార్టనర్‌షిప్ మోడల్‌ను తీసుకొచ్చాననని, ఆ విధానంతోనే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ టవర్స్, హైటెక్ సిటీని నిర్మించానని, దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లోనే పీపీపీని తెచ్చిన తాను తాజాగా పీ4ను తీసుకొస్తున్నామని, ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు(పీ4) భాగస్వామ్యంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన డీప్‌టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్‌ఫామేషన్ ఇండియా టు వికసిత్ భారత్, ఏఐ ఫర్ ఎవ్రీ వన్ అనే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత జీవితంలో ఒక భాగమైందన్నారు. ఒకప్పుడు ఆహార ధాన్యాలు కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతోందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జి హబ్‌గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపు ఇచ్చారు. ఒకప్పుడు జనాభా నష్టం అనుకుమన్నామని.. కానీ ఇప్పుడు అదే జనాభా మన ఆస్తి అని వెల్లడించారు. ప్రపంచంలో అన్ని దేశాలు తక్కువ జనాభా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, జనాభా.. టెక్నాలజీ రెండు అవసరమన్నారు. మన రాష్ట్రమే మొదటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. పవన్ సెక్టార్‌లో ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి సాధించిందన్నారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్‌ను కూడా ప్రారంభిస్తున్నామని అన్నారు.