Storm effect | జల దిగ్బంధంలో పీలేరు బస్టాండు..

పది గ్రామాలకు స్తంభించిన రాకపోకలు.

Update: 2025-10-04 11:57 GMT
పీలేరు ఆర్టీసీ బస్టాండులో పరిస్థితి ఇదీ.

చిత్తూరు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలోని పీలేరు ఆర్టీసీ బస్టాండు జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఉద్యానవన పంటల్లో నీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో పది గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లు ప్రాధమిక సమాచారం అందింది. కుండపోతగా కురిసిసిన వర్షానికి నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో పది గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లు సమాచారం అందింది. అత్యవసర పనులు ఉంటే మినహా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జిల్లాలో శుక్రవారం వేకువజామున నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల నదులు, కాలువలుకు జలకళ వచ్చింది. తిరుమలలో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఓ ప్రకటన జారీ చేశారు. చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించాలని, రైల్వే అండర్ బ్రిడ్జీల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
పీలేరులో ఎక్కవ ప్రభావం

జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనానికి చాలా చోట్ల తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా పీలేరు ఆర్టీసీ బస్టాండును వరదనీరు ముంచెత్తింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటితో బస్టాండ్ ప్లాట్ ఫాంలతో పాటు, కార్యాలయం గదులవరకు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

ఈ ప్రాంతంలో ప్రధానమైన గార్గేయ, పింఛా నదులు పొంగిపొర్లుతున్నాయి. పీలేరు నుంచి మదనపల్లె మార్గంలోని పింఛా నీది తీవ్రస్థాయిలోనే ప్రవహిస్తోంది. రాయచోటి మార్గంలోని అనేక పల్లెల మధ్య ఉన్న కల్వర్టులపై కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు.
జలదిగ్బంధంలో గ్రామాలు

పుంగనూరు: సోమల మండలం ఆవులపల్లె వద్ద స్తంభించిన రాకపోకలు

పుంగనూరు నియోజకవర్గంలోని పది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. సోమల మండలంలోని గార్గేయ నది ఉధృతికి ఈపరిస్థితి ఏర్పడింది. ఆవులపల్లె, పెద్ద ఉప్పరపల్లెలోకి చేరిన వరదనీటితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలోని సీలమ్మ చెరువు వంక, గార్గేయనదిలో తీవ్రంగానే నీరు ప్రవహిస్తోంది. ఈ నదుల్లో ప్రవహిస్తున్న వరదనీరు అనేక ప్రాంతాల్లో మార్గాల్లో 
కల్వర్టులు, బ్జిడ్జీలు కూడా మునిగిపోయిన స్థితిలో పది గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా స్తంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వరదనీటి కారణంగా ఉద్యానవన పంటలు కూడా నీటమునిగాయి.
తుపాను కారణంగా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో చిత్తూరు, కడప జిల్లాల్లోని మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో జనజీవనానికి ఆటంకం కలిగినట్లు వార్తలు అందాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచనలు చేశారు.
Tags:    

Similar News