ISRO - SULLURUPETA | చారిత్రక మైలురాయికి చేరువలో శ్రీహరికోట
అంతరిక్ష ప్రయోగాల్లో మరో రికార్డు నమోదుకానుంది. నావిగేషన్, భద్రతా వ్యవస్థల కోసం 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-26 08:06 GMT
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం చారిత్రక యవనికపై చెరగని సంతకం చేయనున్నది. ఈ ఘట్టం ఆవిష్కరణకు ఇక మూడో రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఉపగ్రహ వాహకనౌక విజయవంతం చేయడం ద్వారా సంబరాలకు షార్ సిద్ధం అవుతోంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 'నావిక్' (NAVIK) GSLV-F-15 NVS-02 రాకెట్ నింగిలోకి దూసుకుపోవడానికి సన్నాహాలు పూర్తి కావచ్చాయి. సుమారు 2,500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్నిరాకెట్ ప్రయోగించనున్నారు.
ఈనెల 29వ తేదీ ఉదయం 6.23 గంటలకు ప్రయోగించాలని ముహూర్తం నిర్ణయించిన శాస్త్రవేత్తలు దీనికోసం శ్రమిస్తున్నారు. దీనివల్ల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చరిత్రలో చారిత్రాక ఘట్టం నమోదు కానుంది.
1979లో శ్రీహరికోట నుంచి ఇస్రో తన ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
2025 ఆరంభంలో ఇస్రో అమ్ములపొది నుంచి దూసుకుపోయే మొదటి ప్రయోగం ద్వారా 100వ రాకెట్ మైలు రాయిని చేరనుంది. ఇది ఇస్రో చరిత్రలో చారిత్రాత్మకం కానుంది. NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ మిషన్ ఆర్బిట్ (GTO) లోకి విజయవంతంగా పంపించడానికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు.
వ్యోమగాములతో కూడిన నౌకను నింగిలోకి పంపించాలనే లక్ష్యంగా మేథస్సుతో శ్రమిస్తున్న శాస్ర్తవేత్తల సంకల్పానికి నావిక్ NVS-02 తో మరో అడుగు ముందుకు పడనుంది.
2025 డిసెంబర్ 30వ తేదీ పీఎస్ఎల్వీ సీ 60 ఉపగ్రహ వాహక నౌకను విజయవంతం చేశారు. తద్వారా అందులో పంపించిన ఉపకరణాలతో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి మొదటి అడుగు వేసిన ఇస్రో శాస్ర్తవేత్తలు భారత్ ను అభివృద్ధిం చెందిన దేశాల సరసన నిలపిన విషయం తెలిసింది.
100వ మైలురాయికి చేరవలో..
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగంలో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనేక చారిత్రవ విజయాలకు సాక్ష్యంగా నిలించింది. ఆ కోవలోనే చంద్రయాన్ ప్రయోగం కీలకమైనది. శ్రీహరికోట నుంచి మానవులను అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యంగా అడుగు ముందుకు పడింది. ఈ విజయాల పరంపరలో ఇక్కడి నుంచి మానవ రహిత మాడ్యూల్ తో 100వ రాకెట్ ప్రయోగంతో మరో చరిత్రకే కాదు. సంబరాలకు శ్రీహరికోట వేదిక చేయడానికి అంకుఠిత దీక్షతో శాస్ర్తవేత్తలు తమ మేథస్సును ఉపయోగిస్తున్నారు.
నావిక్ ప్రత్యేకతలు ఏమిటంటే..
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది.
అనుసంధానం పూర్తి
శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక వద్ద శాస్త్రవేత్తలు రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించడానికి మూడు దశల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేశారు. శిఖర భాగంలో ఉన్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా నావిక్ వ్యవస్థకు సంబంధించిన ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
నావిక్ అనేది భారత దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రాంతీయ నావిగే షన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది 1500 కి.మీ. వరకు భారత భూభాగం వెలుపల కూడా సరిగ్గా, వేగంగా సమాచారా న్ని అందించగలుగుతుంది.
"ఈ ప్రయోగంతో ఇస్రో భార త అంతరిక్ష పరిశోధనలో ప్రధానంగా నావిగేషన్, భద్రతా వ్యవస్థల అవసరాలు, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక అడుగును వేయబోతుంది. ఈ ప్రయోగం ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగంగా గుర్తింపు లభించనుంది. షార్‌లో వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని ఇస్రో ప్రకటించింది.