గోబెల్స్ కు చంద్రబాబే ఫస్ట్ టీచర్ అంటున్న జగన్

చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ మండిపాటు

Update: 2025-12-04 07:23 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. సూపర్‌-6,7 సూపర్‌హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాటా అబద్ధమన్న వైఎస్‌ జగన్‌.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్‌-6,7 సూపర్‌హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్‌ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్‌కు చంద్రబాబే టీచర్‌’’ అంటూ వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్‌ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్‌ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.
చిన్నారుల జీవితాలు ఛిద్రం..
చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్‌ జగన్‌ దుయ్యబటారు.
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసేశారు. స్కూల్‌లో డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.
Tags:    

Similar News