డిప్యుటేషన్ పై మునిసిపల్ శాఖకు వచ్చే వారికి నిబంధనలు
మున్సిపల్ కమిషనర్లు,అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకం పై విధివిధానాలు జారీ చేసిన ప్రభుత్వం.;
ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల పలు నిబంధనలతో జీవో జారీ చేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన జీవో జారీ చేశారు.
పంచాయతీ రాజ్, రెవెన్యూ, స్టేట్ ఆడిట్, సెక్రటేరియట్ శాఖల నుంచి మాత్రమే మున్సిపల్ శాఖకు అనుమతి.
మాతృ శాఖలో ఐదేళ్లు సర్వీస్ తో పాటు బ్యాచిలర్ డిగ్రీ, అకౌంట్ టెస్ట్ లు పాస్,విజిలెన్స్ కేసులు లేకుండా ఉన్న వారికి మాత్రమే అర్హత.
ఆయా శాఖల్లో పొందుతున్న జీతం ఆధారంగా మున్సిపాలిటీ పోస్టులకు అర్హత.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న కమిషనర్, అడిషనల్ కమిషనర్ పోస్టుల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే ఇతర శాఖల వారితో భర్తీ.
మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు గా నియమితులైన వారికి నెల రోజుల పాటు ట్రైనింగ్ తప్పనిసరి.
ఇతర శాఖల నుంచి వచ్చిన వారిని ఏ సమయంలోనైనా మాతృ శాఖకు పంపించే లా నిబంధన. ప్రభుత్వం జారీ చేసిన జీవో జత చేయడమైనది.