CM CHANDRABABU - AP POLICE | మా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు సార్..

అంతవరకు అప్పులు చేసుకుంటాం. ఐదేళ్లుగా మాకు న్యాయం జరగలేదు. ఇప్పడూ పరిస్థితి మారలేదని ఓ పోలీస్ ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు.

Update: 2024-12-26 11:34 GMT

గత ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగానే పోలీసు శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. టీఏ, డీఏలు లేవు. వేతనాల నుంచి చెల్లించిన జీపీఎఫ్ నుంచి రుణం మంజూరు కావడం లేదు. మా శాఖపై ఇంత వివక్ష ఎందుకని కడుపు మండిన ఓ కానిస్టేబుల్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పోలీస్ గ్రూప్ లో ఆయన రాసిన లేఖ వైరల్ అవుతోంది. పోలీస్ శాఖలో ఇదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

కడప జిల్లా ఏఆర్ (ARMED RESERVE) హెడ్ కానిస్టేబుల్ (HEAD CONISTABLE) దేవేందరరెడ్డి పోలీస్ వాట్సప్ గ్రూప్ లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా, పోలీసులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. జీపీఎఫ్ రుణంతో పాటు, పాత బకాయిలు చెల్లిస్తామని ఆశగా ఎదురుచూస్తున్నాం. సరెండర్ లీవ్ (SL) నగదుగా మార్చుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయిందని ఆయన గుర్తు చేశారు.
వాట్సప్ లో దేవేందరరెడ్డి రాసిన ఈ లేఖపై కడప జిల్లా పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
'అనంత' సంఘటన రిపీట్
వైసీపీ పాలనలో కూడా అనంతపురం జిల్లాలో ఇదే తరహాలో పోలీస్ అధికారుల సంఘంలో బాధ్యుడిగా ఉన్న దళిత సామాజికవర్గానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ 2003 జనవరిలో తన సహచర సిబ్బంది కోసం గళం విప్పారు. జీ సీఎం వైఎస్. జగన్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో "పోలీసుల పెండింగ్ బకాయిలు చెల్లించండని నినదించడంతో పాటు ప్లకార్డు ప్రదర్శించారు". దీంతో ఆయనను అధికారులు క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశారు. ఆ తరువాత సర్వీసు నుంచి తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన దీక్షకు దిగడంతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కడప ఏఆర్ పోలీస్ లేఖాస్త్రం
రాష్ర్టంలో మొదట పోలీసుల ఆర్థిక బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటా అని సీఎం ఎన్. చంద్రబాబు చెప్పిన మాటలను కడప ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దేవేంద్రారెడ్డి గుర్తు చేశారు. పాత బకాయిలు ఎప్పుడిస్తారో చెబితే, అప్పులు చేసుకుంటాం. అని ఓ పోలీస్ సీఎం, డిప్యూటీ సీఎంకు లేఖాస్త్రం సంధించారు. ఆయన ఏమని రాశారంటే..
సార్ నమస్కారం సార్.
సీఎం సార్ గారికి డిప్యూటీ సీఎం గారెకి, లోకేష్ గారికి అందరికీ నమస్కారం. సార్ నా పేరు దేవేంద్రారెడ్డి. నేను కడప జిల్లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను.
సార్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 7 నెలలు అయినది.
మేము ఎంతగానో ఎదురుచూస్తున్న పాత బకాయిలు.. SLS , ASLS, T.A, DAగానీ ఐఆర్ గానీ జీపీఎఫ్ లోన్ గాని APGLI LOAN గాని, అరియర్స్ ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని అందరం అనుకున్నాం. కానీ ఏడు నెలలు అయిపోతున్నా కూడా ఇంతవరకు వీటిలో ఏ ఒక్కటి కూడా మాకు అందలేదు. ఎందుకు సార్ మా మీద చిన్న చూపు?
సాక్షాత్తూ సీఎం ఎన్. చంద్రబాబే త్వరలో పోలీసులకు అందరికంటే ముందుగా క్లియర్ చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు చేయలేదు. మేము ఈ రోజు పడతాయి. రేపు పడతాయి. అని ఎదురు చూస్తూ, చాలా ఆవేదనకు గురవుతున్నాం. సార్ నాలాంటి మధ్యతరగతి పోలీసులు చాలా మంది బాధపడుతున్నారు సార్. కనీసం క్రిస్మస్ కు పై వాటిలో ఏ ఒక్కటి అయినా పడతాయి. అని ఎదురు చూశాం సార్. కానీ ఏమీ పడలేదు కనీసం మా అవసరాలకు మా జీతం నుండిచి RECOVERY చేసుకున్న APGLI గాని GPF నుంచి loan పెట్టుకుంటే... అదికూడా pendibg పెడితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మీ ఉద్దేశంలో ఎప్పుడు వదలాలి అనుకుంటున్నారు సార్. అదేదో చెప్తే దాన్ని బట్టి మేము అప్పులైనా చేసుకుంటాం సార్. ఇప్పటికే అప్పులపాలయ్యాం సార్. అసోసియేషన్ వాళ్లు మూడు నెలలకు ఒకసారి వస్తారు. అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సానుకూలంగా స్పందించారని చెప్పి, ఒక వీడియో పెట్టి, మీడియా ముందు వస్తారు. మళ్ళీ కనపడరు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత ఒక రిప్రెజెంటేషన్ పట్టుకుని మళ్లీ సేమ్ డైలాగు చెబుతూ సానుకూలంగా స్పందించారు. త్వరలో వస్తాయి మీకు అని అంటారు. వెళ్లిపోతారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పడలేదు మేము ఎవరిని అడగాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మీరే చెప్పాలి సార్.
బాధతో మీ పోలీసులు. అని రాశారు.
వాస్తమే కదా...?
దీనిపై కడప జిల్లాకు చెందిన కొందరు పోలీసులు మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం సరెండర్ లీవులు (SL'S) 45, అడిషనల్ సరెండర్ లీవులు (ASL'S) 15 మంజూరు అవుతాయి" అని చెప్పారు. అందులో ఏడో నెల (JULY )లో 15 రోజులు, 11వ నెలలో (NOVENBER) మరో 15 రోజులు వేతనంలో కలిపి ఆర్జీత సెలవులు నగదుగా మారుస్తూ జమ చేయాలని వివరించారు. ఇదేదీ అమలు కావడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా, బందోబస్తు, ఇతర అత్యవసర సంఘటనల సమయంలో వెళ్లే విధులకు సంబంధించిన టీఏ, డీఏలు కూడా చెల్లించకుండా, పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు.
తమకు రావాల్సిన బకాయిలు అటు ఉంచితే, వేతనాల నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి రుణం కూడా మంజూరు చేయకుండా పెండింగ్ లో ఉంచుతున్నారని చెబుతున్నారు. దీంతో పిల్లల చదువులు, వివాహాలు చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతోందని కలత చెందుతున్నారు. తమ అసోసియేషియన్ ప్రతినిధుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు మాటమాత్రంగా విన్నవించడం మినహా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నట్లు వాపోతున్నారు. ఇది పోలీస్ శాఖలోనేకాదు. లా అండ్ ఆర్డర్ విభాగంతో పాటు ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది పరిస్థితి కూడా ఇలాగే మారడంతో ఆగ్రహంగా ఉన్నారు.
కూటమికీ తప్పని పోటు
వైసీపీ ప్రభుత్వంపై పోలీసులు, ఉద్యోగులు, ఎన్జీవోలు ఎంత ఆగ్రహం చెందారో తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ మారిన తరువాత కూడా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి ఉంది. ఇది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ లేదు. వారందరికి భిన్నంగా ..
జిల్లాలో కానిస్టేబుల్ నోరు విప్పడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే వేచి చూడాలి. ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే, ఏపీ ఎన్జీఓ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది కూడా కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News