మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై హైకోర్టులో ఏమని పిటీషన్ దాఖలైంది?

మదనపల్లె రికార్డుల దగ్ధం ప్రకంపనలు హైకోర్టు వరకు వ్యాపించాయి. తన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్ లో చెప్పలేదనే ఆరోపణతో ఎన్నికల పిటిషన్ దాఖలైంది.

Update: 2024-07-25 12:43 GMT

"మదనపల్లె రికార్డుల దగ్ధం ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ వివాదాలు సాలెగూడులా అల్లుకుంటున్నాయి. చట్టబద్ధంగా ఆయనను ఇరికించేందుకు అన్ని మార్గాలను రాజకీయ ప్రత్యర్థులు వినియోగించుకుంటున్నారు.తాజాగా

2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఈయనపై టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు), బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెల్లా బాబుకు 94,698 ఓట్లు లభించాయి. బోడె రామచంద్ర యాదవ్ కు 4559 దక్కాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు సాధించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా 6,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల అఫిడవిట్ లో స్థిరాస్తులు రూ. 235 కోట్లు, చరాస్తులు రూ. 53 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, 

"పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.

మదనపల్లెలో రెవెన్యూ రికార్డుల దగ్ధం నేపథ్యంలో ఆయనపై దాఖలైన పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సతీమణి పేరిట రిజిస్టర్ అయిన భూముల వివరాలు గోప్యంగా ఉంచారనే ప్రధానాస్త్రంగా ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ నేపథ్యంలో ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన 21/ఏ భూములతో పాటు డీకేటీ పట్టాల రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? లేదా వేచిచూడాలి.
" పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి కి సంబంధించిన 142 ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదు" అని బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు.
ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్ వాదనలు విన్న తర్వాత స్పందించారు.

"పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)ను ప్రతివాదుల జాబితాలో చేర్చకపోవడంపై అభ్యంతరం చెప్పారు. ఈ వ్యాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు చల్లా రామచంద్రారెడ్డికి కూడా ఉంది" ఆయనను కూడా ప్రతివాదిగా చేర్చాలని జస్టిస్ బి శ్రీనివాస్ సూచన చేశారు.
అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తన సతీమణి స్వర్ణలతకు చెందిన 142 ఆస్తుల వివరాలు ప్రకటించలేదని వాదనను ఆయన ధ్రువీకరించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి ఆస్తుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి" అని పిటిషనర్ బోడే రామచంద్ర యాదవ్ తరపు న్యాయవాదిని ఆదేశించారు. అనంతరం ఈనెల 30 ఒకటవ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు. ఇదిలావుండగా,


ఆ వివరాలు దాచారా?..
బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ బోడె రామచంద్ర యాదవ్ చేసిన ఆరోపణలు ఇవి.
"మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల ఆఫిడవిట్లో వివరాలు దాచారు" అని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా..
"దక్షిణాఫ్రికాలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల వ్యాపారం చేస్తున్నారు. ఆదాయ వివరాలను వెల్లడించలేదు" అని హైకోర్టులో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ లో ప్రస్తావించారు.

"చిత్తూరు జిల్లాలో 142 భూములకు సంబంధించిన రికార్డులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన భార్య స్వర్ణలత పేరుతో ఉన్నాయి. ఈనాం భూములను బినామీల పేరిట రాయించుకున్నారు. హైదరాబాద్ ఢిల్లీ, బెంగళూరు వ్యాపారాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి వాటి వివరాలను కూడా దాచి పెట్టారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పై 12 కేసులు ఉంటే, నాలుగు మాత్రమే ఉన్నాయని అఫీడబిట్ లో ప్రస్తావించారు" అని పిటిషనర్ బోడె రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.
కేసు ప్రాధాన్యం ఏమిటంటే..


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటన ప్రకంపనలు సృష్టించింది.రెండు రోజుల నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పీ. సిసోడియా స్వయంగా మదనపల్లలె మకాం వేశారు. కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. డీకేటీ, ౨౨ఏ భూముల రిజిస్ట్రేషన్ వల్ల నష్టం జరిగిన బాధితుల నుంచి వినతిపత్రాల స్వీకరణ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించకుంది. పుంగనూరు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని మండలాల్లో 22ఏ భూములు బినామీల ద్వారా కొనుగోలు చేయించి, ఆ తరువాత వాటిని రిజిస్టర్ చేయించుకున్నట్లు, రికార్డులే చెబుతున్నాయి. ఇందులో పెద్దిరెడ్డితో పాటు ఆయన సతీమణి స్వర్ణలత పేరిట ఆ నియోజకవర్గాల్లోనే కాకుండా తిరుపతి, శ్రీకాళహస్తి సమీపంలోని విమానాశ్రయం సమీపంలోని భూములకు సంబంధించి భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఎన్నికల పిటిషన్ ద్వారా...
2024 ఎన్నికల పిటిషన్ లో కొన్ని వివరాలు దాచారనేది బీసీవై అధ్యక్సుడు రామచంద్రయాద్ ప్రధాన ఆరోపణ. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం అయిన తరువాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం రెవెన్యూ, పోలీస్ విచారణాధికారులకు సహకారం అందించే విధంగా కనిపిస్తోంది. మదనపల్లెలో ఆ సంఘటన జరిగే వరకు 21/ఏ భూములు, అటవీ భూములు, డీకేటీలు పట్టా చేసుకున్న విషయం మదనసపల్లె రెవెన్య అధికారులకు మినహా బాహ్య ప్రపంచానికి తెలియదు. రికార్డులు దగ్ధం కావడంతో వాటి మూలల లింకులు కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోంది.
ముమ్మరంగా వివరాల సేకరణ
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పీ సిసోడియాతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్త్రేషన్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్దిరెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత పేరిట ఏ భూములు రిజిస్ట్రేషన్ జరిగిందనే వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుండగా, హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం వల్ల స్వయంగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను, తన భార్య పేరిట .జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు అందివ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పోలీస్, రెవెన్యూ, సీఐడీ యంత్రాంగం సాగిస్తున్న దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు వెల్లడి కాగలవనేది వేచిచూడాలి.
Tags:    

Similar News