విజయం "పరిటాలకు" అంకితం

పరిటాల కుటుంబం ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నది. తను సాధించిన విజయాన్ని భర్త పరిటాల రవీంద్ర కు సునీతమ్మ అంకితమిచ్చారు.

Update: 2024-06-05 16:49 GMT

అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత రికార్డు స్థాయి 23,500 ఓట్లతో గెలుపొందారు. తన కుమారులు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ తో కలసి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లి ఆమె డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలిసి పరిటాల సునీత రామగిరి మండలం వెంకటాపురం వెళ్లారు. అక్కడ పరిటాల ఘాట్ వద్ద డిక్లరేషన్ ఫామ్ ఉంచి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత ఉద్వేగానికి లోనయ్యారు. పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. ఈ గెలుపు తమ పై మరింత బాధ్యత పెంచిందని వారు వ్యాఖ్యానించారు. "గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్ల అరాచక పాలనకు.. సుపరిపాలన అందిస్తామన్న టీడీపీకి మధ్య జరిగిన పోరాటం ఇది" అని పరిటాల సునీత అన్నారు."రాప్తాడు నియోజకవర్గంలో ఐదేళ్లపాటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సంబందీకుల ధమనకాండకు ఓటర్లు ముగింపు పలికారు" అని ఆమె వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News