శ్రీహరికోట:బాహుబలి రాకెట్ సక్సెస్... హిందూ మహాసముద్రంపై పట్టు
చైనా, పాక్ నౌకల కదలికలపై నిఘా ఇస్రో చైర్మన్ నారాయణన్.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-02 13:05 GMT
సముద్ర వాణిజ్యంలో కీలకమైన హిందూ మహాసముద్రంపై దేశానికి మరింత పట్టు లభించింది. సీమాంతర ఉగ్రవాదం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర రక్షణ శాఖ ఉక్కుపాదం మోపనుంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు LVM-03-M-5 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు నిప్పులు చెరుగుతూ, నింగిలోకి దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో నిలపడం ద్వారా దేశంలో కమ్యూనికేషన్, నావిగేషన్, రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే విధంగా రూపకల్పన చేశారు.
"భారత అంతరిక్ష ప్రయోగంలో ఇది ఒక మైలురాయి" అని ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వ్యాఖ్యానించారు.
"ఈ ప్రయోగం వల్ల దేశీయ సాంకేతికతతో పాటు కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగుపడతాయి. జాతీయ భద్రతలో కీలకంగా అంతరిక్షం నుంచి నిఘా మరింత పటిష్టం చేయడంలో ఈ శాటిలైట్ కీలకంగా మారనుంది" అని ఆయన చెప్పారు.
ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"చైనా నౌకల కదలికలపై నిఘా ఉంటుంది. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన జలాంతర్గాములు, నౌకలకు సాంకేతిక సహకారం అందిస్తుంది. ఆ దిశగా CMS-03 రాకెట్ పదేళ్ళపాటు సేవలు అందించే దిశగా రూపకల్నన చేశారు. జీశాట్ -07 స్థానంలో CMS-03- రాకెట్ విజయవంతంగా ప్రయోగించాం" అని ఇస్రో నారాయణన్ ప్రకటించారు. ఇది అద్భుత విజయంగా ఆయన అభివర్ణించారు.
విస్తృత సేవలు
శ్రీహరికోట నుంచి ఆదివారం ప్రయోగించిన ఈ రాకెట్ ను జిఎస్ఎల్వి మార్క్-3 (GSLV Mark-3) గా కూడా పిలుస్తున్నారు. హిందూ మహాసముద్రం పై కమ్యూనికేషన్ సేవలను మరింత పటిష్టం చేసే దిశగా సి ఎం ఎస్ త్రి ఒక మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర తీర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవల అందిస్తుంది. సముద్ర యానంలో రక్షణ శాఖ నేవీ నిఘా అవసరాలకు కూడా ఈ ఉపగ్రహం విస్తృతంగా సేవలు అందిస్తుంది.
సవాళ్ళకు దీటుగా జవాబు..
సీమాంతర ఉగ్రవాదం, ఆయుధాల అక్రమ రవాణా వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కేంద్ర రక్షణ దళాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (Satish Dhawan Space Launch Center ISRO) వెన్నుదన్నుగా ఇస్రో నిలిచింది.
శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం 1971 అక్టోబర్ 9న తేదీ రోహిణి-125 సౌండ్ రాకెట్ తో ప్రయోగాత్మక పరీక్షలకు శ్రీకారం చుట్టారు. 55 సంవత్సరాల సుదీర్ఘ ప్రయోగాల ప్రయాణంలో చంద్రుడిపై కూడా అన్వేషణక చంద్రయాన్ -1 ప్రయోగం వరకు స్వదేశీ ఉపగ్రహాల తయారీ, ప్రయోగం వరకు షార్ కేంద్రం పయనం సాగిస్తోంది. ఈ ప్రస్థానంలో షార్ నుంచి ధ్రువ ఉపగ్రహాలు, జియోసింక్రనైజ్డ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మూడు లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. చంద్రయాన్ ఉపగ్రహాల ప్రయోగానికి వెదికగా నిలిచి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరనన నిలపడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ విజయాలతో ఇక్కడి శాస్త్రవేత్తలు చంద్రయాన్ తో పాటు మార్స్ ఆర్బిటర్ మిషన్, సౌర పరిశోధనకు మిషన్ ఆదిత్య-ఎల్-1, అంతరిక్ష అబ్వర్వేటరీ XpoSat ప్రయోగంగా ద్వారా ఇప్పటి వరకు
2025 జూలై నాటికి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 102 ప్రయోగాలు చేశారు. వాటిలో 86 విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు విజయదరహాసంతో మరిన్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ పరంపరంలో 11 ప్రయోగాలు విఫలమయ్యాయి. ఆ అపజయాలను కూడా విజయాలుగా మలుచుకున్న ఖ్యాతి ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కింది.
సైనిక అమ్ములపొదిలోకి..
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం భారతదేశ రక్షణ, తీరప్రాంతాల గస్తీ, భద్రత కోసమే కాకుండా వ్యవసాయ, విద్యా సంబంధ రాకెట్లను కూడా ప్రయోగించింది. ఆ కోవలోనే ఈ నెలాఖరులో ప్రయోగించిన జీశాట్-7 ఆర్ ఉపగ్రహం కీలకంగా వ్యవహరించింది. ఆ శాటిలైట్ కాలపరిమితి తీరిన నేపధ్యంలో దాని స్థానంలో CMS-03 శాటిలైట్ భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. భారత నావికాదళం, సైనికుల కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత శక్తిమంతం చేసే దిశగా ఉపకరణాలు అమర్చారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలకు మరింత సురక్షితమైన సమాచారం అందించేందుకు వీలుగా శాటిలైట్ ను తయారు చేశారు. భూ స్థిర కక్ష్యలో పనిచేసే ఈ శాటిలైట్ మూడో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు.
"ఈ ఉపగ్రహం మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత పదును పెడుతుంది" అని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు. దాయాది దేశం పాకిస్తాన్, దానికి మద్దతుగా నిలిచే చైనా నౌకాదళ కదలికలపై కూడా నిఘా ఉంచడమే కాకుండా, సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టగలరన్నారు.
సముద్రంపై మరింత పట్టు
హిందూ మహాసముద్రం మరింత పట్టు సాధించే దిశగానే జీశాట్-7, దాని స్థానంలో ప్రవేశపెట్టిన LVM-03-M-5 రాకెట్ ప్రయోగించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలమార్గం. దేశానికి ఈ మహాసముద్రం వ్యూహాత్మక స్థానం అనేది చరిత్ర చెబుతున్న మాట. భౌగోళికంగానే కాకుండా, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వాణిజ్యానికి ఈ సముద్రం వ్యూహాత్మక వాణిజ్య, రవాణాకు జీవరేఖగా ఉంది. ఈ మార్గంలోనే అనేక ఎదురవుతున్న సవాళ్లలో ప్రధానంగా సముద్ర భద్రత ముప్పు, స్మగ్టింగ్, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా వంటి సవాళ్లకు హిందూ మహాసముద్రం నుంచి ఎదురువుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించిన నేపథ్యంలో వినువీధి నుంచి నిఘా అవసరం ఏర్పడింది.