మహిళలే మహారాణులు... అసెంబ్లీలో పెరిగిన ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ సంఖ్య రెట్టింపు అయింది. అనంతపురం జిల్లా నుంచి ఏకంగా నలుగురు గెలవడం విశేషం.
By : SSV Bhaskar Rao
Update: 2024-06-05 10:19 GMT
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది. రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశానికి ఓటర్లు కూడా తమ తీర్పుతో అండగా నిలిచారు. గత ఎన్నికల్లో 14 మంది మహిళలు ఉంటే, 2024 ఎన్నికల్లో 21 మంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో 20 మంది మహిళలు టిడిపి నుంచి గెలుపొందారు.
రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి అధికంగా పోటీ చేసిన నలుగురు మహిళలు, నెల్లూరు నుంచి మొదటిసారి పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించిన వారిలో ఉన్నారు. వారంతా టిడిపి అభ్యర్థులే.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీకి గత నెల 13వ తేదీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల సుదీర్ఘ వ్యవధి అనంతరం ఈవీఎం లోని ఓట్లను జూన్ 4వ తేదీ లెక్కించారు. అంటే 24 గంటల క్రితం లెక్కించిన విషయం తెలిసింది. అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. టిడిపి 145 అసెంబ్లీ విజయం సాధించగా, జనసేన 21, బిజెపి 8 స్థానాల్లో పాగా వేసింది. అధికారంలో ఉండి కూడా సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్ సీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా, మహిళలకు టిడిపి అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించింది. వారంతా విజయం సాధించారు.
పెరిగిన ప్రాధాన్యం..
రాష్ట్రంలో టిడిపి కూటమికి అనూహ్య ఫలితాలు దక్కాయి. ఎందుకు అనేక సామాజిక అంశాలు పనిచేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కకు ఉంచితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళ ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రధాన మేరకు అవకాశం పట్టించుకున్న ప్రతి సెగ్మెంట్ లో మహిళలు విజయం సాధించడం ద్వారా సత్తా చాటారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో మహిళలు 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లా బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ గెలిచారు. మిగతా 20 మంది మహిళలు కూడా టిడిపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు...
తాజా సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా రాయలసీమలోని అనంతపురం నుంచి నలుగురు, విజయనగరం, పార్వతీపురం నుంచి ఐదుగురు, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇద్దరు, కాకినాడ, అనకాపల్లి నుంచి ముగ్గురు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లా నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒకరు, నెల్లూరు నుంచి ఇద్దరు, కర్నూల్ నుంచి ఇద్దరు, కడప జిల్లా నుంచి ఇద్దరు మహిళలు గెలుపొందారు. వారిలో ఎస్సీ రిజర్వు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో కూడా గెలిచిన డాక్టర్ సుధ మినహా మిగతా 20 మంది టిడిపి మహిళా ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.
2019 ఎన్నికల్లో 14 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. వారిలో రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి మంత్రి కేవి ఉషా చరణ్, సింగనమల అసెంబ్లీ స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతి, చిత్తూరు జిల్లా నగిరి నుంచి మంత్రి ఆర్కే రోజా, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి, బద్వేల్ నుంచి డాక్టర్ ఉష మినహా మిగతా వారెవరు తాజా ఎన్నికల్లో గెలవలేదు.
అనంతలో అత్యధికం..
రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ ఏకంగా నలుగురు మహిళలకు అవకాశం కల్పించింది. వారిలో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత విజయం సాధించారు. అంతకుముందు పెనుగొండ, తర్వాత రాప్తాడు నుంచి కూడా గెలుపొందారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం సెట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో ఆమె మళ్ళీ పోటీ చేశారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో మమేకమై ప్రజలకు చేరువైన పెనుగొండ నుంచి పోటీ చేసిన ఎస్. సవితమ్మ కూడా విజయం సాధించారు.
ఈమెతో కళ్యాణదుర్గం నుంచి రాజకీయ బదిలీపై వచ్చి పోటీ చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాణికేతరురాలు అనే ముద్రతోపాటు, కళ్యాణదుర్గంలో ఆమె అవినీతి ఆరోపణలకు గురయ్యారు. ఇవన్నీ పెనుగొండ నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించిన ఎస్. సవితమ్మకు కలిసి వచ్చాయి.
మడకశిర ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి బండారు శ్రావణిశ్రీ సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె ఈసారి అన్ని అవరోధాలు అధిగమించి, టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు వద్ద పట్టుబట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు టికెట్ సాధించారు.
పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూర రెడ్డి విజయం సాధించిన వారిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి మొదటిసారి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపొందారు. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి న వారిద్దరూ వైఎస్ఆర్ సీపీలో సీనియర్లు అయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యను మట్టికరించారు.
గతంతో.. పోలిస్తే..
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మహిళ ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2019 ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఐదు మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా వైఎస్ఆర్సిపి నుంచే ప్రాతినిధ్యం వహించారు. నెల్లూరు జిల్లా నుంచి ఒక మహిళ కూడా ప్రాధాన్యం దక్కలేదు. 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య పదికి చేరింది. అందులో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి నుంచి నలుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కడప నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ మాధవి రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నుంచి మళ్లీ డాక్టర్ సుధాకర్ గెలుపొందారు. గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి మహిళలకు ప్రాతినిధ్యం లేకపోతే ఆ పరిస్థితి తిరగబడి, తాజా ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి మహిళలకు రాజకీయం లేకుండా పోయింది.
మంత్రి యోగం ఎవరికి
2014 ఎన్నికల్లో అంతపురం జిల్లా రాప్తాడు నుంచి గెలుపొందిన టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర మంత్రిగా వహించారు. సీనియర్ రీత్యా పరిగణలోకి తీసుకున్న పరిటాల సునీతమ్మకు అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కూడా గెలుపొందిన భూమా అఖిలప్రియ కూడా సీనియర్ జాబితాలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆమె టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశారు. వీరికి తోడు ధర్మవరం నుంచి టిడిపి కూటమీలోని బిజెపి నుంచి గెలిచిన సత్యకుమార్ కూడా ఉన్నారు. మహిళల్లో మిగతా వారందరూ గతంలో పోటీ చేసి ఓడినవారు కొందరున్నారు. వారిలో కొత్త ముఖాలు ఎక్కువ ఉన్నాయి. మిత్రధర్మంలో పురుషులను పరిగణలోకి తీసుకుంటే సత్యకుమార్ పేరు మంత్రివర్గంలో పరిశీలనలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2020 4 ఎన్నికల్లోనే అత్యధిక మంది మహిళలు గెలుపొందారు. మహిళా సమస్యలు, ఇతర సామాజిక అంశాలపై వీరు ఏ స్థాయిలో మాట్లాడగలరు? నిర్ణయాల్లో ఇలాంటి పాత్ర పోషిస్తారు అనేది వేచి చూడాలి.