కుప్పంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..
రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు సొంత ఇంటిలోనే రెండోసారి బస.;
కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం ఎన్. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. శాంతిపురం మండలంలో నిర్మించుకున్న సొంత ఇంటిలోనే రెండోసారి ఆయన బస చేస్తున్నారు. హెలికాప్టర్ లో బెంగళూరు నుంచి శాంతిపురం చేరుకున్న సీఎం చంద్రబాబు స్వాగతం అందుకున్న తరువాత తన నివాసంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. పరమసముద్రం చెరువు వద్ద శనివారం ఆయన జలహారతి ఇవ్వనున్నారు. దీనికోసం అక్కడ ప్రత్యేక పైలాన్ కూడా ఏర్పాటు చేశారు.
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు ఎంపీ దుగ్గిమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఎన్. అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్, గాలి భానుప్రకాష్, విఎం. ధామస్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ తదితరులు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి శాంతిపురం మండలంలోనే ఉన్న తన సొంత ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుప్పంలో ఆయన ఇల్లు నిర్మించుకున్న తరువాత రెండోసారి బస చేస్తున్నారు. తన నివాసంలోనే రాత్రి పొద్దుపోయే వరకు కూడా సీఎం చంద్రబాబు కుప్పం నేతలలో పాటు, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం అయినట్లు సమాచారం అందింది. జిల్లాలో పార్టీ వ్యవహారాలపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇదిలావుండగా