కల్లి తండాకు బయలుదేరిన జగన్
రాష్ట్ర సరిహద్దులో జగన్ కు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కల్లి తండాకు చేరుకోెనున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-13 07:25 GMT
కాశ్మీర్ యుద్ధభూమిలో వీరమరణం చెందిన ఎం. మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ కల్లి తాండాకు మంగళవారం ఉదయం బయలుదేరారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న ఆయనకు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపటి కిందట వైసీపీ శ్రేణులు, నాయకులు ఘనంగా స్వాగతించారు.
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన ఎం. మురళీనాయక్ కాశ్మీర్ యుద్ధభూమిలో వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి ఆదివారం తుదివీడ్కోలు పలికారు.
వీరమరణం చెందిన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడానికి మాజీ సీఎం వైఎస్. జగన్ మంగళవారం మధ్యాహ్నం కల్లి తాండాకు చేరుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని యలహంక నివాసం నుంచి బయలుదేరిన ఆయన కొద్ది సేపటి కిందట వైఎస్. జగన్ బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు.
కల్లితండకు మధ్యాహ్నం చేరుకుని, మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి. శ్రీరాం నాయక్ తో మాట్లాడతారు. కల్లి తండలో సుమారు రెండు గంటల పాటు వీరజవాన్ కుటుంబీకులు, ప్రజలతో మాట్లాడతారని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళతారు.