దుర్గమ్మ సన్నిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు
ఆలయ ఈవో సీనా నాయక్, వేదపండితులు జస్టిస్ ధీరజ్ ఠాకూర్ దంపతులకు స్వాగతం పలికారు.;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ దంపతులు ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ దంపతులకు దుర్గమ్మ దేవాలయ ప్రధాన అధికారి వీకే సీనా నాయక్‌తో పాటు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దంపతులు దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించారు.
దుర్గమ్మ అమ్మవారి చిత్రపటంతో పాటు ఆలయ ప్రసాదాన్ని ఈవో సీనా నాయక్ అందజేశారు. అనంతరం జస్టిస్ ధీరజ్ ఠాకూర్ దంపతులు అద్దాల మండపంలో దుర్గామల్లేశ్వరస్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. దుర్గమ్మ దేవాలయం ప్రత్యేకతలు, విశిష్టతలు, దుర్గమ్మ వారికి నిత్యం జరిగే పూజలతో పాటు దుర్గమ్మ దేవాలయ డెవలప్‌మెంట్ గురించిన వివరాలు జస్టిస్ ధీరజ్ ఠాకూర్ ఆయల ఈవో సీనానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ మేరకు దుర్గమ్మ ఆలాయానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు.