పవన్ కల్యాణ్ అంటే కొత్త నిర్వచనం...

అంటాడు... వదిలేస్తాడు... ఆయన అదో టైప్;

Update: 2025-07-12 09:45 GMT

రాజకీయాల్లో పూర్వం చెప్పింది చేసేవాళ్లు. చేయకపోతే చెడ్డపేరుస్తుందని భయపడే వాళ్లు. ప్రస్తుత రాజకీయాల్లో చెప్పింది చేయకపోవడమే గొప్పతనం.దాన్నొక కళ తా తీర్చిదిద్దుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇస్తున్నాయి. ఆ తరువాత వదిలేస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ‘ఇచ్చిన హామీలు’ అమలు చేయాలంటే భయమేస్తోందని అన్నారు.

ఇటువంటి వ్యాఖ్యలు 20 ఏళ్ళకు ముందుకు వినలేదు. పైగా రాజకీయ నాయకులు అధికార, ప్రతిపక్షం తేడా లేకుండా కలిసిమెలిసి ఉండే వారు. ఇప్పుడు రాజకీయ నాయకులు శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. అడ్డుకుంటున్నారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదోరకం తంతు.

2024 ఎన్నికల నుంచి ట్రెండ్ మారింది. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు కె పవన్ కల్యాణ్ ఎన్నో మాటలు చెప్పారు. అవి ఆచరణలోకి రాలేదు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాన్ ఇచ్చిన హామీలు ఆయన మరిచిపోయారు. ప్రజలు కూడా మరిచిపోయారు. అయితే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చేసిన వ్యాఖ్యలు, తనిఖీలు, ఆ సందర్భంలో అన్న మాటలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

‘సీజ్ ద షిప్’ అన్నాడు, వదిలేశాడు...

తిరుమల ప్రసాదంలో జంతుకొవ్వు అన్నాడు, వదిలేశాడు.

సనాతన ధర్మం, వారాహి డిక్లరేషన్ అన్నాడు, ఏమైందో తెలియదు. వదిలేసినట్లేగా.

సినిమా హాళ్లలో రేట్లు ఇష్టానుసారం ఎలా నిర్ణయిస్తారన్నారు, వదిలేశాడు.

హోం మంత్రి స్థానంలో నేనుంటే ఏమి జరిగేదో అన్నాడు, దాన్ని అలా వదిలేశాడు.

హిందీ రాజ్య భాష అందరూ నేర్చుకోండి, అంటున్నాడు. దీనిని ఎప్పుడు వదిలేస్తారో తెలియదు.


టీడీపీకి హెచ్చరిక..

ఇన్ని వదిలేసిన పవన్ కల్యాన్ టీడీపీని ఎప్పుడైనా వదిలేయవచ్చు. జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పలువురు పెడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు ఫార్వర్డ్ చేసే పనిలో ఉన్నారు. దీనిపై చర్చకు పవన్ కల్యాణ్ వ్యవహార శైలే కారణమని చెప్పవచ్చు.

Tags:    

Similar News