గుంటూరు:తల్లిదండ్రుల ఆత్మశాంతించాలని ప్రత్యర్థి హత్య

వర్గపోరులో పనిచేయని బంధుత్వం.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-18 14:01 GMT

ఆ రెండు కుటుంబాల మధ్య విడదీయని ఆత్మయత ఉండేది. సంబంధాలు కూడా ఉన్నాయి. ఐదేళ్ల కిందట మొదలైన ఆధిపత్య పోరు ప్రత్యర్థులుగా మార్చింది. ఆలయ నిర్వహణ, చేపల చెరువుల విషయంలో కక్షలు పెరిగిపోయాయి. ఈ ఆధిపత్య పోరులో పైచేయి సాధించలేక అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కొడుకు ప్రత్యర్థిని నరికి చంపాడు. సీసీ కెమెరాలు నిందితుడిని పట్టించాయి. ఈ వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరు తాడిపర్రులో జుటూరి తిరుపతిరావు, గండికోట క్రిష్ణమూర్తి బంధువులు. గ్రామంలోని ఆలయ నిర్వహణపై వారిద్దరి మధ్య ఐదేళ్ల క్రితం ఆధిపత్య పోరు మొదలైంది. అంతకుముందు వారి కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. అయినా ఒక కుటుంబంపై మరొక కుటుంబానికి కక్షలు మొదలయ్యాయి. గ్రామంలోని రాములవారి ఆలయం నిర్వహణ విషయంలో తిరుపతిరావు, క్రిష్ణమూర్తి మధ్య చిచ్చు రగిలింది.
తిరుపతిరావుదే పైచేయి..
ఆలయ నిర్వహణ నుంచి చందాలు వసులు చేయడం, ఖర్చు చేయడం వరకు తిరుపతిరావు మాటే చెల్లుబాటు అయింది. దీంతో పాటు గ్రామంలోని చేపల చెరువుల విషయంలోనూ తిరుపతిరావే పై చేయి సాధించాడు. నిస్సహాయతకు గురైన ఆయనకు ప్రత్యర్థిగా మారిన క్రిష్ణమూర్తి ఈ విషయాలన్నీ కొడుకు సుబ్బారావుకి చెప్పి బాధపడేవాడని తెలిసింది. దీనిని ఘోర అవమానంగా వారిద్దరు భావించారు. బంధువు అయిన తిరుపతిరావు పెత్తనానికి అడ్డుకట్ట వేయాలనే కృష్ణమూర్తి ఎత్తులు పనిచేయలేదు. దీంతో సుబ్బారావుపై క్రిష్ణమూర్తికి కక్ష పెరిగింది. ఇదిలావుంటే, కొతంకాలం కిందట క్రిష్ణమూర్తి అనారోగ్యంతో చనిపోయాడు.
గ్రామం విడిచి.. ప్రాణం వదిలి..
గ్రామంలో గొడవలు భరించలేని సుబ్బారావు ఊరు వదిలి తెనాలికి చేరుకున్నాడు. గొడవల వల్ల భార్య వెళ్లిపోవడంతో సుబ్బారావు మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడు. కొన్నిరోజుల కిందట జ్వరంతో తిరుపతిరావు తెనాలిలోని అల్లుడింటికి వైద్యం కోసం వచ్చాడు. అదే కాలనీలో సుబ్బారావును గమనించాడు. ఒంటరిగా టిఫిన్ చేస్తుండగా ఈ నెల పద్నాలుగో తేదీ తిరుపతిరావుపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. సిసి కెమెరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
Tags:    

Similar News