దవళేశ్వరం వద్ద పొర్లుతున్న గోదావరి
సముద్రం పాలు కాకుండా గోదావరి నీటిని పాలకులు ఎప్పుడు పట్టుకుంటారో ఏమో?;
గోదావరి వరద ప్రవాహం శనివారం సాయంత్రం 7 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 41.1 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.29 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం రేపటి నుంచి ధవళేశ్వరం వద్ద వరద క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు.
దోదారమ్మ సముద్రం పాలు కావాల్సిందేనా?
గోదావరి వరద నీరు సముద్రం పాలు కావడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. దీనిని పరిష్కరించుకోలేని పాలకులు తగాదాలకు పోవడం, పరస్పద వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం పరిపాటిగా మారిందని పలువురు నీటి పారుల శాఖ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి నీటి బోట్టూ సముద్రం పాలు కాకుండా పాలకులు ఎప్పుడు చూస్తారో అప్పుడే వారు ప్రజల శ్రేయస్సును కోరుకున్న వారు అవుతారని చెప్పొచ్చు.