ఆర్థిక శాఖ నిధి భవన్‌లో అగ్నిప్రమాదం
కీలక కంప్యూటర్లు, ఫైళ్లు కాలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలమైన నిధి భవన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగులందరూ విది నిర్వహణలో ఉండగా నిధి భవన్ రెండో అంతస్తులో ఒక్క సారిగా మంటలు వ్యాప్తించాయి. విధులు నిర్వహిస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులు ఒక్క సారిగా ఆందోళనలకు గురయ్యారు. ఒక్క సారిగా మంటలు వ్యాపించడంలో పరుగులు తీస్తూ కిందకు దిగారు.
ఈ అగ్ని ప్రమాదంలో కంప్యూర్లు, వివిధ రకాల ఫైళ్లు కాలిపోయి ఉండొచ్చనే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు చెందిన లావాదేవీల బిల్లులు వివరాలతో కూడి ఫైళ్లు వంటి ఎంతో విలువైనవి ఉండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంత మేరకు నష్టం జరిగిం¯దనే దానిని అధికారులు అంచనా వేయలేక పోతున్నారు. అన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడంతో జీతభత్యాలు, చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.