ప్రముఖ సహజకవి అందెశ్రీ కన్నుమూత

64 ఏళ్ళకే ‘మాయమైపోయాడమ్మ’ సహజకవి అందెశ్రీ

Update: 2025-11-10 03:51 GMT
Telangana Poet AndeSri

ప్రముఖ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్ధతతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం ఇంట్లోనే రచయిత గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అందెశ్రీ కి తెల్లవారిజుమునుండే బాగా నలతగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పల్స్ కొట్టుకోవటం బాగా పడిపోవటంతో స్పృహతప్పిపడిపోయారు. దాంతో వెంటనే కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ గేయం ‘జయజయజయహే తెలంగాణ జననీ జనకేతనం‘ ను అందెశ్రీనే రచించారు. ఈ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ గేయంగా ప్రకటించింది. ఈయనకు 64 ఏళ్ళు. సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన అందెశ్రీ తెలంగాణలోని ప్రముఖ రచయితల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన రచనలతో ఉద్యమానికి చాలా ఊపుతెచ్చారు.


అందెశ్రీ సహజకవి. ఆయనకు చదువుకునే అవకాశం రాలేదు. గ్రామాల్లో నిరం తరం జరిగే యక్షగానాలు, కోలాటాల పాటలు ఆయనలోని కవిని నిద్రలేపాయి. ఆయన తాపీ పనివాడిగా నిజామాబాద్ వలస వెళ్లారు.ఆధునికత పేరుతో మనిషి కానరాకుండా పోతున్న వైనాన్ని మనీషన్న వాడు మచ్చుకైనలేడు అని ఎర్రసముద్రం సినిమాలో పది సంవత్సరాల క్రితమే అందెశ్రీ తన పాట ద్వారా మహాగొప్పగా చాటిచెప్పారు.

ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా తెలంగాణ ఒడిలో పెరిగారు. ఏ విధమయిన చదువూ చదవలేదు.అయితే, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు

గొడ్లకాపరిగా...

అందెశ్రీ కాకముందు ఆయన గొడ్ల కాపరిగా పనిచేసారు. ఒకసారి అందెశ్రీ పాటపాడుతుండగా శృంగేరి మఠం స్వామీ శంకర్ మహారాజ్ విని ఆయన్ని చేరదీసాడు. అన్ని రకాల హావభావాలను సులభంగా ఇముడ్చుకునే ఆయన గొంత పాటని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లింది. సీని దర్శకుడు నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు.

ఆయన తాత్వికత

భజన భజంత్రీల పాటలు వద్దు,

ఎంగిలి పాటలు రాయకు

నీవు చూసిన బతుకుపాటలు రాయి

నీకై నీవె కైకట్టు – మనసుపెట్టి...

అనేది ఆయన ఆయన తత్వచింతన

ఆయన పాడితె ఎలా ఉంటుందంటే...

‘పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి....,’ అని బ్లాగ్ పోస్టులో ఆయన గురించి వచ్చిన విశేషాలు ఉన్నవి ఉన్నట్లు అందిస్తున్నాం.

"....అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. ఆనాటి కవిత్వయుగంలో కనిపించేవన్నీ కొండ కోనలపై మెరిసే మరఫిరంగులే. అలాంటి కవుల కన్నా భిన్నంగా రాయడం ఎలా? మేస్త్రీగా ఉన్నప్పుడు చదువుకున్న విజ్ఞులు నేస్తాలయ్యారు. ఎన్న టికీ మరువరాని పెద్దలెందరో ఉన్నారు. అందరూ అతని కవిత్వ ఇంధ్రధనువుకి ఏడురంగులు అద్దారు. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు. అలసి సొలసివస్తే తాము తినే అన్నాన్ని పెట్టారు. తాము తాగే నీళ్ళిచ్చారు. పడుకునే ఇరుకు మంచంపై కాస్తంత చోటిచ్చారు. అపుడు ఆకలి తీరింది కాబట్టే పాటలపై దృష్టి మర లింది. ‘పాటలపూదోట’లో గేయాలు, ‘అందెల సందడిల’లో వచన కవిత్వం ఉంది. అయినా అతనిలో అసంతృప్తి. అప్పుడు ఆలోచనలు రేపిన కలాలు ఉన్నాయి.

ప్రోత్సా హం నింపిన నేస్తాలు ఉన్నారు. అభయహస్తం ఇచ్చినవారు, పాటల జనజాతరలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుల సహవాసంతో పాట కోసం పరిశోధన చేపట్టాడు. పరిశోధించి పాటని సిద్ధాంతవ్యాసం చేశాడు. పాట, పరి శోధన పని కలిపి తాత్విక చింతనగా మార్చాడు. జనహిత మార్గంలో పాటల్ని తన వంతు కార్యకర్తలుగా చేశాడు. వందలకొద్దీ పాటలు రాయాలని కాదు. ఒక చరణం వేలాది ప్రజల చిరునామా కావాలన్నదే అతని ధ్యేయం. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగంపట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే విలక్షణ కవి అందెశ్రీ. అనువాదం చేస్తే ఆదికవి అనవచ్చు. కాని అనుకరణ చేసే ఏలాంటి కవినైనా ప్రజలు తిరస్కరిస్తారు అంటాడు. జానపదాలను తక్కువగా చూసి అది తప్పని తెలు సుకున్నాడు. ఆ ప్రజల పాటలే తన పాటలకింత ఔన్నత్యం కలిగించాయని అంటాడు.

పసుల కాసే పిల్లగాడికి ఏ భీమ్‌సేన్‌ జోషికి, మంగళం పల్లికి, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మికి దక్కని దత్తపీఠం, గౌరవం, స్వర్ణకంకణం, లక్ష రూపాయల సత్కారం అందెశ్రీకి దక్కిందంటే ప్రజల పాటలకున్న శక్తే అని ఆయన అభిప్రాయపడతాడు. మార్గనుండి లలిత, దేశీ నుండి జనం బాణీల్లోకి చేసిన యాత్రలో అతను ఆస్తికు డూకాదు నాస్తీకుడూ కాదు. అతని పాటలు ఏవీ ఇలాంటి ఏ భావజాలాన్ని సమర్థిం చవు. నిజానికి నాకు దైవం మీద నమ్మకం కన్నా ప్రకృతిమీద గౌరవం అధికం. కను పించని దైవభావన కన్నా ముందున్న మట్టిమానవుల సాహిత్యానికీ, వారి మాండలిక భాషకు-వీటికి మూలమైన పల్లెకీ వినమ్రంగా దండం పెడతా నంటాడు.

ఒక మతంలోనో, ఒక కులంలోనో జీవించవలసి రావడం దురదృష్టం. దాన్ని నిరాకరించడమే నా అభిమతం. అదే నా అస్థిత్వం అని స్పష్టంగా ప్రకటిస్తాడు. ‘ఈ లోకం నీ ఇల్లు జన మంతా నా వాళ్ళు’ అని అనుకోని వారితో పేచీ పడతాడు. తన గేయాలతో వారికి గాయాలైనా ఎదుర్కొంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆధ్యాత్మికత పై కాలు పెట్టి అసమానతల ధిక్కారంవైపు నా పల్ల వుల దండుని నడుపుతానంటాడు. పల్లె పాఠశాలలో నేర్చిన విద్యార్థి జనం వైపుంటాడు. జనానికి దూరమైన ఎలాంటి విష యాన్నైనా ఖండిస్తాడు. అలాంటి అందెశ్రీని ఒక ప్రశ్న అడిగితే – ఆనాడు నేను అంటరానివాడిని. యజ్ఞంలో రుత్వికుడిగా కూర్చో బెట్టినందుకు గర్వించాను. కాని నష్కల్‌లో దళిత కళారూపాలపై ప్రదర్శనలు జరిగిన సందర్భంలో అంటరాని వాళ్ళకు అంట రానివారైన డక్కలివాళ్ళ గుడిసెలో భోజనం చేసినందుకు ఎంతో గర్విస్తాను."

ముఖ్యమంత్రి రేవంత్ ఆవేదన

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ

Tags:    

Similar News