actor Mohan Babu | చంద్రగిరిలో మోహన్ బాబు ప్రత్యక్షం

సినీనటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చేసారు. మరో వివాద ఎపిసోడ్ ప్రారంభమయ్యే సూచనలు లేకపోలేదంటున్నారు.

Update: 2024-12-16 07:36 GMT

మంచు మోహన్ బాబు కుటుంబకథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉన్నట్టుండి ఆయన చంద్రగిరిలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఈ రీల్ లో మరో ఎపిసోడ్ కు తెరలేస్తున్నట్లే కనిపిస్తోంది.

కుటుంబ వివాదాల నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి గుర్తు చప్పుడు కాకుండా వచ్చేశారు. ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన రంగంపేటలోని "మోహన్ బాబు యూనివర్సిటీ"లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన వద్ద ఉన్న లైసెన్సుడు తుపాకీని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. కాదు. శుక్రవారమే ఆయన పీఆర్ఓ స్వాధీనం చేశాడని చెబుతున్నారు.

మంచు ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసింది. వారం నుంచి ఈ ఎపిసోడ్ సినిమా కథలానే కాదు. సీరియల్ గా నడుస్తోంది. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద కవరేజ్ కి వచ్చిన మీడియా బృందంలో ఓ జర్నలిస్టుపై మంచు మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరిగింది.

"నేను ఎక్కడికి పారిపోలేదు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా" అని సామాజిక మాధ్యమాల వేదికగా మోహన్ బాబు వివరణ ఇచ్చారు. మోహన్ బాబు ఆచూకీ తెలుసుకుని, అరెస్టు చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారని ప్రకటించారు.

వారు గాలిస్తుండగానే, ఆదివారం తన చేతిలో గాయపడిన మీడియా జర్నలిస్టును మోహన్ బాబు పరామర్శించిన విషయం తెలిసిందే. రాత్రి పొద్దుపోయిన తర్వాత మోహన్ బాబు స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటకు చేరుకున్నారు. అక్కడి తన యూనివర్సిటీలోని నివాసానికి మోహన్ బాబు వెళ్లారు.

తుపాకీ అప్పగింత

తన రక్షణ కోసం సినీ నటుడు మోహన్ బాబు వద్ద ఓ పిస్టల్, మరొకరి పేరిట డీబీబీఎల్ (DBBL Gun) కూడా తుపాకీ కూడా ఉంది. తన వ్యక్తిగత భద్రత కోసం ఆయన తుపాకీ కోసం లైసెన్స్ కూడా తీసుకున్నారు. తాజాగా ఆయన కుటుంబంలో జరుగుతున్న ఘర్షణ. ఉద్రిక్త ఘటన నేపథ్యంలో మంచు మోహన్ బాబు సోమవారం ఉదయం చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన లైసెన్స్ తుపాకీని అక్కడి పోలీస్ అధికారులకు అప్పగించారు. అని చెబుతుంటే, కాదు. ఆయన పీఆర్ఓ హేమాద్రి నాయుడు శుక్రవారమే చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సమాచారం. ఇదిలావుంటే..

తనపై హైదరాబాద్ లో నమోదైన కేసుల నేపథ్యంలో ఆలస్యంగా నైనా పోలీసుల విచారణకు మోహన్ బాబు హాజరయ్యారు. ఆ సందర్భంలో.. "మీ వద్ద ఉన్న తుపాకీ అప్పగించండి" అని తెలంగాణ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి స్పందనగా "సాయంత్రం లోపల తుపాకీ అప్పగిస్తాను "అని హామీ ఇచ్చిన మోహన్ బాబు, తర పీఆర్ఓ ద్వారా పోలీసులకు స్వాధీనం" చేసినట్లు చెబుతున్నారు.

అకస్మాత్తుగా చంద్రగిరికి..

మంచు వారి ఇంట మండిన కలహాలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఆయన కొడుకులు మంచు విష్ణు, మనోజ్ రగలిగిన గొడవల మంటలు ఇంకా సమసిపోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోహన్ బాబు రాత్రికి రాత్రే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తన నివాసం ఉన్న రంగంపేటలోని "మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి" ( Mohan Babu University) చేరుకున్నారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తొపాకులు స్వాధీనం చేయడానికి కాకుండా, "లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే మోహన్ బాబు వచ్చారు" అని ఓ సీనియర్ జర్నలిస్టు చెబుతున్నారు.

మంచు కుటుంబంలో అంతర్గతంగా ఆస్తికి సంబంధించిన వివాదాలు చెలరేగినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో కథ పీక్ కు చేరడంతో మంచు మనోజ్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంగా అడుగులు వేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇది మరింతగా వివాదాలకు ఆస్కారం కల్పిస్తుందనే విషయం తిరుపతిలో చర్చకు దారి తీసింది. వీరి కుటుంబకథా గొడవకు మోహన్ బాబు ఎలాంటి ముగింపు ఇవ్వనున్నారనేది వేచిచూడాలి.

Tags:    

Similar News